[[@YHRK]] [[@Spiritual]]

Kālāgni rudra Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 2
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com
Courtesy - sanskritdocuments.org (For ORIGINAL Slokas Without Sandhi Splitting)


కృష్ణ యజుర్వేదాంతర్గత

9     ‌కాలాగ్ని రుద్రోపనిషత్

(భస్మ త్రిపుండ్ర ధారణా యోగము)

శ్లోక తాత్పర్య పుష్పమ్



బ్రహ్మజ్ఞానోపాయతయా యద్విభూతిః ప్రకీర్తితా .
తమహం కాలాగ్నిరుద్రం భజతాం స్వాత్మదం భజే ..
శ్లో।। బ్రహ్మజ్ఞాన ఉపాయతయా, యత్ విభూతిః ప్రకీర్తితా,
తమ్ అహం కాలాగ్ని రుద్రం భజతాం స్వాత్మపదం భజే।

ఏ విభూతిరూపుడైతే బ్రహ్మజ్ఞానమునకు ఉపాయ ముగా బ్రహ్మజ్ఞులచే ప్రకీర్తించబడుచున్నారో, అట్టి మహత్తరుడగు స్వాత్మపదమును ప్రసాదించు కాలాగ్ని రుద్ర భగవానుని భజించుచున్నాను.

ఓం కాలాగ్ని రుద్రాయనమః। సంవర్తికోగ్ని ఋషయే నమః। ఓం సనత్కుమారాయ నమః।


ఓం అథ కాలాగ్నిరుద్రోపనిషదః
సంవర్తకోఽగ్నిరృషిరనుష్టుప్ఛందః
శ్రీకాలాగ్నిరుద్రో దేవతా
శ్రీకాలాగ్నిరుద్రప్రీత్యర్థే
భస్మత్రిపుండ్రధారణే వినియోగః ..
ఓం
1 అథ కాలాగ్ని రుద్రోపనిషదః।
సంవర్తకో-గ్ని ఋషిః।
అనుష్టుప్‌ఛందః।
శ్రీకాలాగ్ని రుద్రో దేవతా
శ్రీకాలాగ్ని రుద్ర ప్రీత్యర్థే
భస్మత్రిపుండ్ర ధారణే వినియోగః।
(త్రిపుండ్రధారణ విధిని నిర్వచించు) ఈ కాలాగ్నిరుద్రోపనిషత్‌కు
ఋషి= సంవర్తికో-గ్ని ఋషిభ్యోం - నమోనమః
ఛందస్సు = అనుష్టుప్।
దేవతా = శ్రీకాలాగ్నిరుద్రుడు।
శ్రీకాలాగ్నిరుద్ర భగవానుని ప్రీతి కొరకు (మరియు) ‘ఓం’కార రూపుడగు ఆ పరమాత్మయొక్క అనుగ్రహము కొరకై ఆశ్రయించబడుచున్నట్టి - భస్మ-త్రిపుండ్ర ధారణము→ వినియోగము

అథ కాలాగ్నిరుద్రం భగవంతం సనత్కుమారః పప్రచ్ఛ
ఓం అథ కాలాగ్నిరుద్రం,
భగవంతం - సనత్కుమారః పప్రచ్ఛః:
బ్రహ్మామానసపుత్రుడగు సనత్కుమారుడు ఒకసారి - భగవంతుడగు కాలాగ్ని రుద్ర భగవానునికి ప్రణామము సమర్పించి, ఈ విధంగా పరిప్రశ్నించసాగారు.

అధీహి భగవంస్త్రిపుండ్రవిధిం సతత్త్వం
కిం ద్రవ్యం కియత్స్థానం కతిప్రమాణం కా రేఖా
కే మంత్రాః కా శక్తిః కిం దైవతం
కః కర్తా కిం ఫలమితి చ .
2 అధీహి భగవన్। త్రిపుండ్ర విధిం స-తత్త్వం,
కిం ద్రవ్యం? కియత్ స్థానం?
కతి ప్రమాణం? కా రేఖాః? కే మంత్రాః?
కా శక్తిః? కిం దైవతం?
కః కర్తా? కిం ఫలం? ఇతి చ।
‘‘హే కాలాగ్ని రుద్ర భగవాన్! తత్త్వార్ధపూరితమైన - విభూతి ధారణకు సంబంధించిన - ‘త్రిపుండ్రవిధి’ గురించి దయతో వివరించండి. అట్టి త్రిపుండ్ర ధారణ విధికి సంబంధించిన ద్రవ్యము ఏది! అద్దాని స్థానము ఎయ్యది! ప్రమాణము ఎంత? రేఖలు ఎట్టివి? పఠించవలసిన మంత్రము ఏది? అద్దాని శక్తి ఎటువంటిది? అట్టి విధికి దేవత ఎవరు? కర్త ఎవరు? ఫలము ఏదై ఉన్నది? సవివరణగా నాకు బోధించ ప్రార్ధన.’’

తం హోవాచ భగవాన్కాలాగ్నిరుద్రః
యద్ద్రవ్యం తదాగ్నేయం భస్మ
సద్యోజాతాదిపంచబ్రహ్మమంత్రైః
పరిగృహ్యాగ్నిరితి భస్మ వాయురితి భస్మ జలమితి భస్మ
స్థలమితి భస్మ వ్యోమేతి భస్మేత్యనేనాభిమంత్ర్య
తగ్ం హోవాచ భగవాన్ కాలాగ్ని రుద్రః।
యత్ ద్రవ్యం, తత్ ‘ఆగ్నేయం భస్మ’।
‘సద్యోజాత’ ఆది పంచబ్రహ్మ మంత్రైః పరిగృహ్య।
అగ్నిరితి భస్మ। వాయురితి భస్మ।
వ్యోమేఽతి భస్మ। జలమితి భస్మ। స్థలమితి భస్మ।
- ఇతి అనేన అభిమంత్ర్య,
కాలాగ్ని రుద్రభగవానుడు : త్రిపుండ్ర ధారణ విధికి ద్రవ్యము -అగ్నిచే రూపము దిద్దుకొన్నట్టి ‘‘భస్మము’’. విభూతిని పరిగ్రహించుచున్నప్పుడు - పంచబ్రహ్మమంత్రములను పఠిస్తూ గ్రహించాలి.
సత్యోజాతం ప్రపద్యామి - మొదలుకొని గల ‘5’ మంత్రములను పఠిస్తూ అగ్ని భస్మమును తయ్యారుచేయాలి.
అభిమంత్రణ : జలముతో తడుపుచూ ‘‘అగ్నిరితి భస్మ’। వాయురితి భస్మ। వ్యోమేఽతి భస్మ। జలమితి భస్మ! స్థలమితి భస్మ’’.. అని ఆ భస్మమును అభిమంత్రించాలి.

మానస్తోక ఇతి సముద్ధృత్య
మా నో మహాంతమితి జలేన సంసృజ్య
త్రియాయుషమితి శిరోలలాటవక్షఃస్కంధేషు
త్రియాయుషైస్త్ర్యంబకైస్త్రిశక్తిభిస్తిర్యక్తిస్రో
రేఖాః ప్రకుర్వీత వ్రతమేతచ్ఛాంభవం
సర్వేషు దేవేషు వేదవాదిభిరుక్తం
భవతి తస్మాత్తత్సమాచరేన్ముముక్షుర్న పునర్భవాయ ..
‘మానస్తోక’ ఇతి సముద్ధృత్య,
‘మానో మహాంతమ్’ ఇతి
జలేన సంసృజ్య, ‘త్రియాయుషమ్’ ఇతి
శిరో లలాట వక్షః
స్కంధేషు త్రియాయుషైః త్ర్యంబకైః త్రిశక్తిభిః
తిర్యక్ తిస్రో రేఖాః ప్రకుర్వీత।
‘‘మానస్తో కే తనయే మాన ఆయుషి మానో। గోషు మానో। అశ్వేషురీరిషః। వీరాన్మాన। రుద్ర భామితో వధీః హవిష్మంతో నమసావిధేమతే।।.. అను మంత్రము చెప్పుచూ, భస్మమును చేతులతో రాసుకొని, ‘‘మానో మహాన్తమ్। ఉతమానో। అర్భకంమాన। ఉక్షన్తమ్ ఉతమాన ఉక్షితం। మానో అవధీః। పితరం మోత। మాతరం ప్రియా। మానః తనువో రుద్రరీరిషః।।’’, అను మంత్రమును జపిస్తూ జలముతో ఆ భస్మమును తడపాలి.
‘‘త్రియాయుషం జమదగ్నేః, కశ్యపస్య త్రియాయుషం, యత్‌దేవానాం త్రియాయుషం - తత్ మే (తన్మే) అస్తు త్రియాయుషమ్।..’’ అనే మంత్రము చదువుచూ శిరస్సు- ముఖము - రొమ్ము-భుజములపై…. త్రియాయుషములతో, త్ర్యంబకములతో, త్రిశక్తులతో అడ్డముగా మూడు రేఖలు వ్రాయాలి!
వ్రతమ్ ఏతత్ ‘‘శాంభవమ్’’ సర్వేషు, వేదేషు
వేదవాదిభిః ఉక్తం భవతి।
తస్మాత్ తత్ సమాచరేత్
ముముక్షుః న పునః భవాయ।
‘శాంభవము’ అనబడే ఈ త్రిపుండ్రధారణ విధి 4 వేదములలోను చెప్పబడినదై, వేదవాదులచే ముముక్షువులకు సాధనదీక్షగా బోధించ బడుతోంది. ఇట్టి శాంభవ-త్రిపుండ్ర ధారణ - త్రిరేఖా భస్మలేపన విధిని వ్రతముగా ఎవ్వరు శ్రద్ధతో ఆచరిస్తూ.. మంత్రముగ్ధంగా త్రిరేఖా భస్మధారణ చేస్తూ ఉంటారో, వారు (వారికి శ్రద్ధ-పట్టుదలలు తోడు కాగా) పునర్జన్మ రహితులు అగుచున్నారు.

అథ సనత్కుమారః పప్రచ్ఛ ప్రమాణమస్య
త్రిపుండ్రధారణస్య త్రిధా రేఖా
భవత్యాలలాటాదాచక్షుషోరామూర్ధ్నోరాభ్రువోర్మధ్యతశ్చ

3 అధ సనత్కుమారః పప్రచ్ఛ :
ప్రమాణమ్ అస్య
త్రిపుండ్ర ధారణస్య,
త్రిథా రేఖా భవంతి,
ఆ లలాటాత్ ఆ చక్షుషోః,
ఆ మూర్థ్నో భ్రువోః మధ్యతశ్చ।
శ్రీ సనత్కమారుడు (పరిమాణము) : త్రిపుండ్రధారణకు ప్రమాణము ఏది? అడ్డముగా భస్మరేఖలు ఎంతవరకు పొడుగుగా ధరించాలి? వాటి వాటి వైదాంతిక - ఆధ్యాత్మిక అర్థములు ఎట్లా ఎరిగి ఉండాలి?

కాలాగ్ని రుద్ర భగవానుడు :
సద్యోజాతాది పంచమంత్రములు
1. సద్యోజాతం ప్రపద్యమి। సద్యోజాతాయవై నమో నమః। భవే భవేన అతిభవే భవస్వమాం। భవోద్భవాయ నమః।।
2. వామదేవాయ నమో। జ్యేష్ఠాయ నమః। శ్రేష్ఠాయ నమో। రుద్రాయ నమః। కాలాయ నమః। కలవికరణాయ నమో। బలవికరణాయ నమో। బలాయ నమో। బలప్రమథనాయ నమః। సర్వభూత దమనాయ నమోః మనో - ఉన్మనాయ నమః।।
3. అఘోరేభ్యో। అథ ఘోరే భ్యో। ఘోరఘోరతరేభ్యః। సర్వేభ్యః। సర్వ। శర్వేభ్యో। నమస్తే అస్తు రుద్రరూపేభ్యః।।
4. తత్పురుషాయ విద్మహే, మహాదేవాయ ధీమహి। తన్నో రుద్రః ప్రచోదయా
5. ఈశానః సర్వవిద్యానాం ఈశ్వరః సర్వభూతానాం। బ్రహ్మాధిపతిః।
బ్రహ్మణే-అధిపతిః। బ్రహ్మా శివో మే అస్తు సదాశివ ‘ఓం’।।
ఈ 5 మంత్రములతో విభూతిని గ్రహించాలి.

త్రిపుండ్రధారణ విధిలో ‘3’ రేఖలు.
- లలాటము (నుదురు- ) చివరివరకు గాని (కనుబొమ్మల చివరలను కలుపుచూ పై భాగమంతాగాని),
- కనుల స్థానము వరకు గాని
- మూర్ధ్ని - కనుబొమ్మలకు పై ప్రదేశములో గాని, భ్రూమధ్య ప్రదేశంలోగాని భస్మము (విభూతి) ధారణ చేయాలి.

యాస్య ప్రథమా రేఖా సా గార్హపత్యశ్చాకారో
రజోభూర్లోకః స్వాత్మా క్రియాశక్తిరృగ్వేదః
ప్రాతఃసవనం మహేశ్వరో దేవతేతి
యా అస్య ప్రథమా రేఖా,
సా ‘గార్హపత్య’ శ్చ, ‘అ’కారో,
రజో, ‘భూః’ లోక, ఆత్మా క్రియాశక్తిః,
- ఋగ్వేదః ప్రాతః సవనం।
- మహేశ్వరో దేవతా- ఇతి।।
అట్టి త్రిపుండ్రము యొక్క

ప్రథమ (1) రేఖ → యజ్ఞ - యాగములలో మొట్టమొదటి అయినట్టి ‘‘గార్హాపత్యాగ్ని’’ రూపము!
- ‘ఓం’కార ప్రణవములోని మొదటిది అయినట్టి ‘అ’కారము।
- త్రిగుణములలోని ‘రజో’గుణ సంజ్ఞ।
- ‘భూ’ లోకము (భూలోకము).
- ఆత్మ యొక్క క్రియాశక్తి (పార్వతి).
- ఋగ్వేదము - ఋక్కుల - మంత్రసారాంశములు
- ప్రాతః సవనం → ఉదయకాలపు ప్రార్థన (సృష్టి ప్రారంభ) ధ్యానోపాసన।
దేవత = మహేశ్వరుడు

యాస్య ద్వితీయా రేఖా
సా దక్షిణాగ్నిరుకారః సత్వమంతరిక్షమంతరాత్మా-
చేచ్ఛాశక్తిర్యజుర్వేదో మాధ్యందినం సవనం
సదాశివో దేవతేతి
4 యా అస్య ద్వితీయ రేఖా,
సా దక్షిణాగ్నిః । ఉకారః।
సత్త్వమ్। అంతరిక్షమ్।
అంతరాత్మా। ఇచ్ఛాశక్తిః।
యజుర్వేదో। మధ్యం దినగ్ం
సవనగ్ం। సదాశివో దేవతా - ఇతి।।
ద్వితీయ (2)వ రేఖ ఏమై ఉన్నది?
- యజ్ఞ-యాగములలో వెలిగించబడే దక్షిణాగ్ని!
- ప్రణవములో రెండవ అక్షరమగు ‘ఉ’కారము
- గుణము = సత్వగుణము, లోకము = అంతరిక్షము.
- అంతరాత్మయొక్క ఇచ్ఛాశక్తి (సరస్వతి).
- యజుర్వేద యజస్సుల - ఉపాసన.
- కాలము - మధ్యాహ్న కాలపు సవనము (ప్రార్థన).
- దేవతా = సదాశివుడు. (సదా శివోపాసన).

యాస్య తృతీయా రేఖా సాహవనీయో మకారస్తమో
ద్యౌర్లోకః పరమాత్మా జ్ఞానశక్తిః సామవేదస్తృతీయసవనం
మహాదేవో దేవతేతి
5 యా అస్య తృతీయా రేఖా,
సా ఆహవనీయో। ‘మ’ కారః।
తమో। ద్యౌః లోకః। పరమాత్మా।
జ్ఞానశక్తిః। సామవేదః।
తృతీయ సవనం।
మహాదేవో దేవత। ఇతి।।
త్రిపుండ్రములోని తృతీయ (3వ) రేఖ ఏదై ఉన్నది?
-ఆహనీయాగ్నికి సంజ్ఞ. మహిమ, విధి.
- ప్రణవములోని మూడవదగు ‘మ’కారము
- గుణము = తమోగుణము
- లోకము = దివి(ద్యౌ) లోకము (దేవలోకము)
- స్వరూపము = పరమాత్మ
- శక్తి = జ్ఞానశక్తి (లక్ష్మి)
- సామవేద సవనము. సాయంకాలోపాసన.
- దేవత : మహాదేవుడు

ఏవం త్రిపుండ్రవిధిం భస్మనా కరోతి
యో విద్వాన్బ్రహ్మచారీ గృహీ వానప్రస్థో యతిర్వా
స మహాపాతకోపపాతకేభ్యః పూతో భవతి
ఏవం త్రిపుండ్రం విధిం, భస్మనా కరోతి,
యో విద్వాన్ బ్రహ్మచారీ గృహీ
వానప్రస్థో యతిర్వా,
స మహాపాతక, ఉపపాతకేభ్యః పూతో భవతి।
ఈ విధంగా త్రిపుండ్ర భస్మధారణను విధి-ఉపాసనాపూర్వకంగా, మంత్రోచ్ఛారణతో నిర్వర్తిస్తూ ఎవరు ఉంటారో, ఆతడు విద్వాంసుడు (పాండిత్యము సముపార్జించువాడు)కాగలడు. ఆతడు, బ్రహ్మచారిగాని, గృహస్థుడుగాని, వానప్రస్థుడు గాని, యతిగాని.. ఏ ఆశ్రమంలో ఉన్నవాడైనా కూడా, మహాపాతక-ఉపపాతములు చేసినవాడు కూడా.. పవిత్రుడు కాగలడు.

స సర్వేషు తీర్థేషు స్నాతో భవతి
స సర్వాన్వేదానధీతో భవతి
స సర్వాందేవాంజ్ఞాతో భవతి
స సతతం సకలరుద్రమంత్రజాపీ భవతి
స సకలభోగాన్భుంక్తే దేహం త్యక్త్వా శివసాయుజ్యమేతి న
స పునరావర్తతే న స పునరావర్తత
ఇత్యాహ భగవాన్కాలాగ్నిరుద్రః ..
స సర్వేషు తీర్థేషు స్నాతో భవతి।
స సర్వాన్ వేదాన్ అధీతో భవతి।
స సర్వాన్ దేవాన్ జ్ఞాతో భవతి।
స సతతం సకల రుద్ర మంత్ర జాపీ భవతి।
స సకల భోగాన్ భుంక్తే,
దేహం త్యక్త్వా శివ సాయుజ్యమ్ ఏతి।
న స పునరావర్తతే। న స పునరావర్తత।
ఇతి ఆహ- భగవాన్ కాలాగ్నిరుద్రః।
యస్తు ఏతత్ వా అధీతే, సో ఆపి ఏవమేవ భవతి
ఇతి ఓగ్ం సత్యమ్।
సర్వ తీర్థములలో స్నానము చేసిన పుణ్యము పొందగలడు. అన్ని వేదముల అధ్యయనము చేసిన ఉత్తమ ఫలము సముపార్జించుకోగలడు.
సర్వదేవతల తత్త్వమును ఎరిగినవాడు అగుచున్నాడు.
ఎల్లప్పుడు రుద్రమంత్రము చదివితే లభించగల ఫలము త్రిపుండ్ర ధారణ విధిని అభ్యసించువాడు పొందుచున్నాడు. ఇహము నందు సకల భోగములు అనుభవిస్తూ, దేహానంతరము శివసాయుజ్యము పొందు చున్నాడు. ఇక ఆతనికి పునరావృత్తి దోషము ఉండదు.
- ఆ బ్రహ్మ-భువనాల్లోక పునరావృత్తి పొందుచున్న ఈ జీవుడు త్రిపుండ్ర భస్మధారణావిధిచే పునరావృత్తి దోషము నుండి పునీతుడు కాగలడు.

ఈ విధంగా కాలాగ్నిరుద్ర భగవానుడు శంకర భగవత్ విభూతియుక్తమగు త్రిపుండ్రధారణ విశేషాలు వివరించారు.
ఎవ్వరు ఈ కాలాగ్ని రుద్రోపనిషత్ అధ్యయనము చేస్తారో, వారు కూడా త్రిపుండ్ర విభూతి విధి యొక్క ఫలము పొందుచున్నారు. ఇది సత్యము.

ఇతి కాలాగ్నిరుద్రోపనిషత్
ఓం శాంతిః| శాంతిః| శాంతిః||



కృష్ణ యజుర్వేదాంతర్గత

9     కాలాగ్ని రుద్ర ఉపనిషత్‌

(భస్మత్రిపుండ్ర ధారణాయోగము)

అధ్యయన పుష్పము

ఓం కాలాగ్ని రుద్రాయ నమః। సంవర్తి కోఽగ్ని ఋషయే నమః। ఓం సనత్కుమారాయ నమః।

ఎవ్వనియొక్క విభూతి బ్రహ్మజ్ఞానమునకు సులభోపాయముగా ప్రకీర్తింపబడుచున్నదో….అట్టి కాలాగ్ని రుద్ర భగవానునికి, స్వ-ఆత్మపదమును ప్రసాదించు ఆ యోగీశ్వరునికి నమస్కరించుచున్నాను.

నమో నమః। ఇప్పుడిక ‘కాలాగ్ని రుద్రోపనిషత్’ తత్త్వమును ఉపాసించుచున్నాను. మంత్రఋషియగు సంవర్త అగ్ని కోఽగ్నికి నమస్కరిస్తున్నాను.

ఛందస్సు → అనుష్టప్
దేవత → శ్రీ కాలాగ్ని రుద్రుడు

అట్టి భగవంతుడగు శ్రీకాలాగ్ని రుద్ర ఆత్మ భగవానుని ప్రీతికొరకై, ఆ స్వామి కరుణా కటాక్ష వీక్షణ కొరకై ‘భస్మ త్రిపుండ్ర ధారణము’ అను ఉపాసనామార్గమును స్వీకరించుచున్నాను.


ఒకానొక సమయములో బ్రహ్మ మానసపుత్రుడగు సనత్కుమారస్వామి ముముక్షువుల పట్ల గల అవ్యాజమైన ప్రేమతో కూడిన హృదయముగల వారై, భక్తి ప్రపత్తులతో కాలాగ్నిరుద్రభగవానుని సమీపించి, త్రి ప్రదక్షిణ - త్రి సాష్టాంగ - త్రి దేహ పూర్వక నమస్కారము సమర్పించి, భగవానుడగు కాలాగ్ని రుద్రుని ఈ విధంగా స్తుతి పూర్వకంగా అభ్యర్థించసాగారు.

శ్రీ సనత్కుమారుడు: హే భగవాన్! కాలాగ్ని రుద్ర-దేవాది దేవా! లోకకళ్యాణమూర్తీ! భక్తవత్సలా! ఆశ్రితవత్సలా! భక్తసులభ ప్రసన్నమూర్తీ! దయార్ద్ర హృదయా! పరమానందస్వరూపా! చంద్రశేఖరా! పాహిమాం! రక్షమాం!

కాలాగ్ని రుద్రభగవానుడు : బిడ్డా! సనత్కుమారా! నీరాక నాకు సంతోషమును కలుగజేస్తోందయ్యా! ఏమీ నీ అభిలాష? చెప్పవయ్యా?

శ్రీ సనత్కుమారుడు : స్వామీ! భస్మభూషితాంగా! ఫాలనేత్ర శూలధారీ! తత్త్వార్థ పూరితమైనట్టి ‘‘భస్మ త్రిపుండ్ర ధారణ విధి’’ యొక్క విధానము, మంత్రోచ్ఛారణలు, అద్దాని ఉద్దేశ్య - పరార్థములు, అద్దాని ప్రయోజనములగురించి మీవద్ద శ్రవణము చేయభావించాను. దయతో ఆ వివరాలు ప్రవచించమని వేడుకొనుచున్నాను.

అట్టి త్రిపుండ భస్మధారణకు సంబంధించి….
- తాత్త్వికార్థము ఏమిటి?
- కిం ద్రవ్యమ్? అందుకు ఏ ద్రవ్యమును ఉపయోగించాలి?
- కిం స్థానమ్? ధారణ చేయవలసిన స్థానము ఏది?
- కతి ప్రమాణమ్? ఎంతటి ప్రమాణముతో ధారణ చేయాలి?
- కా రేఖాః? ఎన్ని రేఖలు?
- కే మంత్రాః? ఉచ్ఛరించవలసిన మంత్రములు ఏవేవి?
- కా శక్తిః? అద్దాని శక్తి ఎట్టిది?
- కిం దైవతమ్? అద్దాని అధిదేవతా మూర్తులు ఎవ్వరెవ్వరు?
- కిం కర్తా? అద్దాని కర్తలు ఎవ్వరు?
- కిం ఫలమ్? త్రిపుండ్ర ధారణవలన కలుగు ప్రయోజనములు ఏమేమి?

ఈ వివరముల గురించి బోధించండి.

కాలాగ్ని రుద్రభగవానుడు : త్రిపుండ్రమునకు (ఆవు పిడకలు - గంధపు చెక్కలు మొదలైన) వస్తువులతో ‘ఆగ్నేయ భస్మము’ (అగ్నితో కాల్చినప్పటి బూడిద)ను సేకరించాలి. ఆ విధంగా విభూతి (ఆగ్నేయ భస్మము) స్వీకరించుచున్నప్పుడు పారాయణము! (పఠనము) చేయవలసిన ‘5’ మంత్రములు చెప్పుచున్నాను.

(1) ఓం సద్యోజాతం ప్రపద్యామి।
సద్యో జాతాయవై నమో నమః|
భవే భవే నాతి భవే
భవస్వమామ్।, భవోద్భవాయ నమః॥
ఏది త్రికాలములలోనూ - "యో జాతమ్ సత్”, ‘కేవలసత్’ స్వరూపమే అయి ఉండి, ఈ జగత్తు రూపముగా కనిపిస్తూ ఉన్నదో, అట్టి పరబ్రహ్మమును స్తుతించుచున్నాను. నమస్కరిస్తున్నాను. భవుడగు ఆయనే ఈ భవమైయున్నది. ఈ విభవమంతా ఆయనయే! ఆయనకు ఆవల ఏదీ లేదు. ఆ భవుడు నన్ను కాపాడునుగాక! అట్టి భవుని నుండి బయల్వెడలు భవమునకు కూడా నమస్కరిస్తున్నాను. ఆయన నా భవ బంధములు తొలగించుగాక!
(2) ఓం వామదేవాయ నమో, జ్యేష్ఠాయ నమః|
శ్రేష్టాయ నమో, రుద్రాయ నమః।
కాలాయ నమః కలవికరణాయ నమః
బలవికరణాయ నమో నమః
బలాయ నమో, బలప్రమథనాయ నమః|
సర్వభూత దమనాయ
నమో మనోన్మనాయ నమః||
కేవలీ స్వరూపుడు, నామ (సుందర రూప) తేజస్సులతో విరాజిల్లువారు,

దేవతలకే దేవత, సర్వమునకు ముందే ఉన్న జ్యేష్ఠులు, సర్వమునకు శ్రేష్ఠులు, సర్వమును పరమ సత్యము నందు లయింపజేయు రుద్ర - కాలస్వరూపులు, కాలఃకాలుడు, కాలమును అకాలము చేయువారు, బలమును గొప్పగా ప్రదర్శించువారు, బలవంతుడు, బలస్వరూపుడు, సమస్త భూతజాల నియామకుడు సర్వజీవులు తన పర్యవేక్షణయందు కలిగి ఉన్నవారు, మనస్సుకే మనస్సు అయినవారు అగు ఆ ఆది దేవునికి నమస్కారము.
(3) ఓం అఘోరేభ్యో అథ ఘోరే ఘోరభ్యో ఘోరతరేభ్యః॥
సర్వేభ్యః సర్వ శర్వేభ్యో
నమస్తే అస్తు రుద్రరూపేభ్యః॥
సూక్ష్మమైన దానికంతటికీ సూక్ష్మ స్వరూపుడు, స్థూలమైన దానికంతటికీ స్థూలమైనవాడు, స్థూల - సూక్ష్మములకు ఆవల కారణ స్వరూపుడు, సర్వులకు సుఖ శాంతి ఐశ్వర్య ఆనంద ప్రదాత, సర్వజీవులు తన స్వరూపముగా కలిగియున్నవారు, సర్వరక్షకులు అగు రుద్ర భగవానునికి నమస్కారము.
(4) ఓం తత్పురుషాయ విద్మహే
మహాదేవాయ ధీమహి!
తన్నోరుద్రః ప్రచోదయాత్|
సాక్షాత్తూ ‘తత్’ → పరబ్రహ్మముగా భాసిల్లుచున్న ఆ పరమపురుషుని ఎరగెదము గాక! అందుకొరకై సర్వమును ఎరిగియున్నవాడు సకల జీవులలో ‘బుద్ధి’ అను ’మహిమ’ను ప్రదర్శిస్తున్నవాడు అగు ‘రుద్రభగవానుడు’ మా యందు ఆత్మబుద్ధిని ప్రేరేపించునుగాక!
(5) ఓం ఈశానః సర్వవిద్యానామ్|
ఈశ్వరః సర్వభూతానామ్।
బ్రహ్మాధిపతిః। బ్రహ్మణో అధిపతిః
బ్రహ్మా శివోమే అస్తు సాదాశివ ‘ఓం’
ఈశ్వరుడే సమస్త విద్యలకు అధిపతి. సృష్టిలోని సమస్త జీవరాశులకు ప్రభువు. సమస్త వేదములకు అధిపతి. సర్వ విద్యలు, సర్వుల ఎరుకలు… అన్నీ ఈశ్వరునికి చెందినవే! సర్వజీవులు (ఎరుగుచున్న వారందరు) ఈశ్వరుడే! ఎరుగబడేది, ఎరుగుచున్నది కూడా అంతటా ఈశ్వరుడే! బ్రహ్మకు (సృష్టికర్తకు) అధిపతి. వేదములలోని బ్రాహ్మణములకు స్తుతి విశేషుడు. సర్వము తానైన ‘ఓం’ సంజ్ఞరూపుడగు సదాశివుడు నాకు శివతత్త్వజ్ఞానము ప్రసాదించును గాక!

ఈ విధంగా ‘ఈ’ 5 మంత్రములు చెప్పుచూ, అర్థముయొక్క భావనను మననము చేస్తూ ‘విభూతి’ని పరిగ్రహించాలి.

విభూతి తయారుచేయునప్పుడు ‘‘అగ్ని రితిభస్మ। వాయురితి భస్మ! వ్యోమేతిభస్మ! జలమితి భస్మ! స్థలమితి భస్మ!’’ ఇతి అనేన అభిమంత్ర్య - అను మంత్రముతో అభిమంత్రించాలి.

ఆ విభూతిని ధారణ చేయబోవుచున్నప్పుడు చేతులకు రాసుకొంటూ,…. చదువు మంత్రము.

మానస్తోకే। తనయే మాన। ఆయుషి మానో।
గోషు మానో। అశ్వేషు ఈరిషః (విశ్వేషు ఈరితః)।
వీరాన్ మనో। రుద్ర భామితో అవధీః।
హవిస్మంతో నమసా విధేమతే।।

విభూతిని చేతులతో రాసిన తరువాత నీటితో తడుపుచూ చదువు మంత్రము :

మానో మహాన్తమ్। ఉత మానో।
అర్భకం మాన।
ఉక్షన్తమ్ ఉతమాన ఉక్షితం।
మానో అవధీః। పితరం మోత।
మాతరం ప్రియా మానః।
తనువో రుద్ర ఈరిషః।।

ఈ విధంగా విభూతి (అగ్నేయ భస్మము)ను నీటితో తడిపి, శిరస్సు - లలాటము - ముఖము - రొమ్ములు - పొట్ట భుజములందు త్రిరేఖలు అవధరిస్తూ ‘‘త్రి-ఆయుష-త్ర్యంబక - త్రిశక్తుల’’ రూపంగా భావన చేయాలి.

త్రి ఆయుష మంత్రము -

త్రియాయుషం జమదగ్నేః।
కస్యపస్య త్రియాయుషం।
యత్ దేవానామ్ త్రియాయుషం।
తన్ మే అస్తు త్రియాయుషం।।

జమదగ్ని కస్యప మహర్షుల వంటి (మరియు) దివ్యమగు దేవతల వంటి త్రి - ఆయుషములు (జాగ్రత్ స్వప్న సుషుప్తులు; ద్రష్ట జీవాత్మ ఈశ్వత్వములు; ధ్యాన ధ్యాత ధ్యేయములు) నాకు ప్రసాదించబడునుగాక!

త్ర్యంబక మంత్రము -

ఓం త్ర్యంబకమ్ యజామహే
సుగంధిమ్ పుష్టి వర్ధనమ్।।
ఉర్వారుకమివ బంధనాత్
మృత్యోః ముక్షీయ।
మా అమృతాత్ ।।

త్రిపురేశ్వడగు శ్రీ శివభగవానుడు మాయందు ఉత్తమగంధములను (సుసంస్కారములను) పుష్ఠిని (ధ్యానయోగ బలములను) వర్ధింపజేసి, అనుగ్రహించెదరుగాక! దోసకాయ పరిపక్వమవగానే దోస తీగ నుండి విడివడుచూ ఉంటుంది కదా! మేము మార్పుచెందుచున్న సర్వము నుండి విడివడి అమృతస్వరూపముతో ఏకము అగునట్లు నడిపించెదరుగాక। మా బుద్ధి జ్ఞాన పరిపక్వత పొంది, మేము ప్రకృతి యొక్క మాయ నుండి విడివడునట్లుగా, మా యొక్క అమృత స్వరూపము వైపు అడుగులు వేయునట్లుగా కటాక్షించెదరుగాక!

త్రిశక్తిమంత్రము -

‘ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి ఓం
ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం।।

ఇచ్ఛ = శ్రీ సరస్వతి, జ్ఞాన = శ్రీలక్ష్మి, క్రియా = శ్రీ పార్వతి

ఈ విధమైన మంత్రములను పలుకుచూ, తాత్వికార్థమును మననము చేయుచూ త్రిపుండ్ర విభూతి (భస్మ) ధారణము చేయు ‘శాంభవీ వ్రతము’…. సర్వ వేదములలో ఉదహరించబడినదే! వేదవాదులచే వ్యాఖ్యానించబడుచున్నదే! ఇహ పర ప్రయోజనములు, మోక్షము కోరువారు శాంభవమైన విభూతి ధారణా వ్రతమును ఆచరించెదరుగాక! అట్టి వారు - న పునః భవాయ - పునర్జన్మ రహితులు అగుచున్నారు. ముముక్షువులు భస్మధారణ విధిని ఆచరించుటచేత శుభము పొందగలరు.

శ్రీ సనత్కుమారుడు : హే కాలగ్నిరుద్ర దేవాదిదేవా! త్రిపుండ్రముయొక్క పరిమాణము గురించిన వివరణ దయచేసి తెలియజేయండి!

కాలాగ్ని రుద్ర భగవానుడు: త్రిపుండ్ర ధారణస్య త్రిధారేఖా భవంతి : అడ్డముగా ‘3’ రేఖలు.
- ముఖము మొత్తముగాని - ఆలలాటాత్,
- కన్నుల చివ్వర - ఆఖరు వరకూగాని - ఆచక్షుషోః,
- తలయొక్క చివ్వరివరకుగాని,.. - ఆ మూర్ధ్నో,
- కనుబొమ్మల మధ్యయందుగాని - భృవోర్మధ్యతశ్చ
త్రిపుండ్రమును ధారణ చేయవచ్చును.

మొదటి రేఖ :
యా అస్య ప్రధమరేఖా, సా ‘గార్హపత్యశ్చ’ ‘అ’కారో, రజో, భూర్లోక, ఆత్మాక్రియాశక్తిః, ఋగ్వేదః, ప్రాతః సవనం మహేశ్వరో దేవతేతి!

ఏది ప్రధమ రేఖయో, అయ్యది:
★ యజ్ఞములో ప్రధమాగ్ని అయినట్టి ‘గార్హాపత్యాగ్ని’ రూపము.
★ ఓంకారలోని ‘అ’కారము.
★ రజోగుణ సంజ్ఞ
★ భూలోకమునకు ప్రతీక।
★ ఆత్మయొక్క క్రియాశక్తి (పార్వతి)
★ ఋగ్వేదరూపము. ప్రాతః కాల సవనము. (ఉపాసనము)
★ దేవత = మహేశ్వరుడు

రెండవ రేఖ -
యా అస్య ద్వితీయరేఖా….

ఏది రెండవ రేఖయో, అయ్యది….
★ యజ్ఞములోని దక్షిణాగ్ని రూపము.
★ ఓంకార ప్రణవములోని ‘ఉ’కారము.
★ సత్వగుణరూపము, అంతరిక్ష రూపము.
★ అంతరాత్మయొక్క ఇచ్ఛాశక్తి రూపము (సరస్వతి).
★ యజుర్వేదము. మధ్యాహ్నకాల సవనము (ఉపాసనము).
★ దేవత = సదాశివుడు.

మూడవ రేఖ -
యా అస్య తృతీయ రేఖా….

ఏది ‘3’వ రేఖయో, అది :
★ యజ్ఞములోని ఆహవనీయాగ్ని రూపము…
★ ఓంకార ప్రణవములోని ‘మ’కారము.
★ తమోగుణరూపము. ద్యులోక (దేవతాలోకము).
★ సామవేదము. తృతీయ (సాయం) సవనము (ఉపాసనము)
★ దేవత = మహాదేవుడు.

శ్రీ సనత్కుమారుడు : ఏ ఏ ఆశ్రమము వారు ఈ త్రిపుండ్ర విభూతి (భస్మ) ధారణావిధికి అర్హులు?

శ్రీ కాలాగ్నిరుద్రభగవానుడు : 4 ఆశ్రములలోవారు కూడా త్రిపుండ్ర ధారణకు అర్హులే! బ్రహ్మచారి - గృహస్థ - వానప్రస్థ. - యతి …. ఎవ్వరైనా సరే ఈ త్రిపుండ్ర విధి దీక్షగా నిర్వర్తించెదరుగాక!


ఫలశ్రుతి :

మహాపాతక - ఉపపాతకములు చేసినవాడు కూడా మంత్ర - మంత్రార్ధభావనాపూర్వకముగా త్రిపుండ్ర విధిని ఆచరించటము చేత పవిత్రుడు కాగలడు. పాపదృష్టులు, సాంస్కారములు భస్మమైపోగలవు.

అట్టి యోగి (లేక) అట్టి త్రిపుండ్రభస్మ ధారణ చేసినవాడు →
✤ సర్వ పుణ్యతీర్థములలో స్నానము చేసినవాడు అగుచున్నాడు.
✤ సర్వ వేదములు అధ్యయనము చేసినవానితో సమానుడు.
✤ సర్వ దేవతల తత్త్వము ఎరిగినవాడుగా అగుచున్నాడు.
✤ ప్రతిరోజూ రుద్రజపము చేయుటచేత లభించే అత్యుత్తమ ప్రయోజనము సిద్ధించగలదు.

అట్టివాడు ఇహములో సకల భోగములను పొంది దేహానంతరము శివసాయుజ్యము పొందుచున్నాడు.

ఆతడు పునరావృత్తిదోషముతో కూడిన ‘జన్మ-కర్మ-చక్రము’ నుండి విడివడుచున్నాడు.

ఈ విధంగా కాలాగ్నిరుద్ర భగవానుడు సనత్కుమారునికి భస్మ త్రిపుండ్ర (విభూతి) ధారణ విధి గురించి వివరించారు.

యస్తు ఏతత్ అధీతే సో అపి ఏవమేవ భవతి। ఇత్యోగ్ం సత్యమ్।
ఎవ్వరు ఈ కాలాగ్ని రుద్రోపనిషత్తు అధ్యయనము చేస్తారో…వారు కూడా అట్టి ఫలమునే తప్పక పొందగలరు. ఇది సత్యము.



🙏 ఇతి కాలాగ్ని రుద్ర ఉపనిషత్ ‌🙏
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।।