[[@YHRK]] [[@Spiritual]]

Dattātrēya Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 4
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com


అధర్వణ వేదాంతర్గత

9     దత్తాత్రేయోపనిషత్

శ్లోక తాత్పర్య పుష్పమ్

శ్లో।। దత్తాత్రేయ బ్రహ్మవిద్యా
సంవేద్య ఆనందవిగ్రహమ్।
త్రిపాద్ నారాయణాకారం
‘దత్తాత్రేయమ్’ ఉపాస్మహే।।

బ్రహ్మవిద్యా పారాయణులు, ఆనంద విగ్రహులు, త్రిపాద శ్రీమన్నారాయణాకారులు అగు శ్రీ దత్తాత్రేయ జగద్గురువును, దత్తాత్రేయ ప్రవచిత బ్రహ్మవిద్యను మనోవాక్కాయాత్మకంగా ఉపాసించుచున్నాము.

ప్రథమ ఖండః - తారకమ్

ఓం।
1. ఓం। సత్యక్షేత్రే, బ్రహ్మా నారాయణం:-
‘‘మహాసామ్రాజ్యం
కిం తారకం?
తన్నో (తత్-నో) - బ్రూహి।’’
ఇతి ఉవాచ।
ఒక సందర్భములో సృష్టికర్తయగు బ్రహ్మదేవుడు సత్యక్షేత్రమునకు వేంచేసిన శ్రీమన్నారాయణుని సమీపించి, ప్రణిపాతులై, - ఆ తరువాత ఈ విధంగా అడుగసాగారు.
స్వామీ! శ్రీమన్నారాయణా! సర్వత్రా వేంచేసియున్న విష్ణు భగవన్! ఆత్మ సామ్రాజ్యమును సిద్ధించుకోవటానికై సమస్త జీవులకు ‘తారకము’ ఏదై ఉన్నది? స్వామీ! అట్టి తారకము ఏమిటో దయతో అనుగ్రహించండి.
(తారకము = తరింపజేయునది. తెప్ప. కష్టకాలములో తోడగునది)

భగవాన్ ఇత్యుక్తః :-
సత్యానంద చిదాత్మకం, సాత్త్వికం,
మామకమ్ ధామ ఉపాస్వ।
శ్రీమన్నారాయణ భగవానుడు : ఓ బ్రహ్మదేవా! కేవలమగు సత్ (ఉనికి) - చిత్ (ఎరుక) - ఆనంద (అనభూతి / భావన) = ఆత్మకమైనట్టిది, పరమ సాత్వికమైనది-అయినట్టి నాయొక్క ‘‘ధామము (State)’’ ఏదైతే ఉన్నదో - అదియే ఆత్మ సామ్రాజ్య సిద్ధికై ఉపాసించవలసినట్టిది.

- ఇతి ఆహ,
‘‘సదా దత్తోఽహమస్మి।’’
ఇతి ప్రత్యేతత్ సంవదంతి యే,
న తే సంసారిణో భవంతి।
ఇంకా వినండి. ఎవరైతే ‘‘నేను సదా దత్తుడను’’ అని స్వస్వరూపతత్త్వమును ఎరిగినవారై ప్రియముగా సునిర్ణయులై పలుకుతారో వారు ఇక ‘సంసారులు’। అయే ప్రసక్తియే ఉండదు.
(దత్తమ్ = ‘‘ఇదంతా నాచేతనే కల్పనా మాత్రము’’ అను స్వస్వరూపాత్మ గురించి ‘ఎరుక’) - ‘‘దత్ తమ్’’
నారాయణేన ఏవం వివక్షితో, బ్రహ్మా
‘‘విశ్వరూపధరం, విష్ణుం,
నారాయణం, దత్తాత్రేయం’’
ధ్యాత్వా సద్వదతి।।
ఈ విధంగా శ్రీమన్నారాయణునిచే బోధించబడినవారై బ్రహ్మదేవుడు : ‘‘ఈ సమస్త విశ్వమును తన రూపముగా ధరించినవాడు, సర్వత్రా సర్వదా విస్తరించి సమస్తము తానే అయి వేంచేసి ఉండటంచేత ఈయన ‘‘విష్ణువు’’.
అన్ని తరంగములు సర్వదా జలమే అయి ఉన్న తీరుగా సమస్త జీవులు వాస్తవ స్వరూపము తానే అయి ఉండటం చేత ఈయనయే ‘‘నారాయణుడు’’ - అని స్మరించసాగారు.
మనన-నిదిధ్యాసలకొరకై సర్వాత్మకుడగు శ్రీ దత్తాత్రేయులవారిని ధ్యానించుచూ ఇట్లా పలుకసాగారు.

‘దమ్’ - ఇతి హంసః।
‘దామ్’ - ఇతి దీర్ఘమ్।
తత్ - బీజమ్।
‘నామ’ - బీజస్థం।
‘‘దామ్’’ - ఇతి ఏకాక్షరం భవతి।
‘తత్’ - ఏతత్ తారకం భవతి।
‘తత్’ - ఏవ (తదేవ) ఉపాసితవ్యమ్।
- విజ్ఞేయమ్।
- ‘గర్భ’ - ఆది తారణమ్।
గాయత్రీ ఛందః।
సదాశివ ఋషిః।
దత్తాత్రేయో దేవతా।
‘‘దత్తాత్రేయ అష్టాక్షరీ’’ (8)
ద+తత్ + తరేయో = దత్తాత్రేయో।
దత్ + తత్ + త్రయో = దత్తాత్రేయో।

‘‘దమ్’’ - ఇది ‘‘హంస’’ (జీవాత్మ)।
‘‘దామ్’’ - ఇది ‘‘దీర్ఘము’’।
‘‘తత్’’ - ఇది ‘‘బీజము’’।
నామ - బీజముగా ఉన్నది ‘‘బీజస్థము’’।
‘‘దామ్’’ - ఇది ‘‘ఏకాక్షరము’’।
ఏకము = అనేకము కానిది. అక్షరము = క్షరములేనిది అగు ‘ఆత్మ’కు సంజ్ఞ (Indication). తారేయో = తరింపజేయునది. కేవలము. సర్వాత్మకత్వము - అయి ఉన్నట్టిది.

ఈ జీవుని సర్వాత్మకత్వ స్వరూపమే ‘తత్’ ‘‘సర్వభూతస్థం ఆత్మానమ్। సర్వాభూతానిచ ఆత్మని - అందరిలోని నేనైన ‘నేను’। అందరు నాలో ఉన్న నేనైన నేను - అనునదే తత్’’।

అట్టి ‘‘తత్’’యే ఉపాసించవలసినట్టిది. అట్టి సర్వాత్మక భావనయే తెలుసుకోవలసినట్టిది. అది జన్మకర్మల చక్రభ్రమణమునుండి తరింప జేయునది.


‘‘ఓం దత్తాత్రేయాయ నమః’’
ఛందస్సు - ‘‘గాయత్రీ’’
ఋషి - ‘‘సదాశివ’’
దేవత-‘‘దత్తాత్రేయస్వామి’’

‘‘ఓం దం దత్తాత్రేయాయ నమః’’
(అష్టాక్షరీ)
2. ‘‘వట బీజస్థమ్’’ - ఇవ
దత్త బీజస్థం సర్వం జగత్।
ఏతదేవ ‘ఏకాక్షరం’
వ్యాఖ్యాతమ్।
(‘దామ్’ వ్యాఖ్యాతమ్।)
వ్యాఖ్యాన్యే ‘షట్(6)-అక్షరమ్। (బీజాక్షరములు)
‘ఓం’ ఇతి ప్రథమం। ‘శ్రీం’ ఇతి ద్వితీయం।
‘హ్రాం’ ఇతి తృతీయం। ‘క్లీం’ ఇతి చతుర్థం।
‘గ్లౌం’ ఇతి పంచమం। ‘ద్రాం’ ఇతి షష్ఠమ్।
షడక్షరో అయం భవతి।।

ఓం శ్రీం హ్రాం క్లీం గ్లౌం ద్రాం


‘‘షడక్షరీబీజ’’ (షట్ బీజ అక్షర సంపుటము)
ఒక మర్రి విత్తనములో మహావృక్షము యొక్క వ్రేళ్ళు, కాండము, కొమ్మలు, రెమ్మలు, ఆకులు, కాయలు, పునఃబీజము ఉన్న తీరుగా, - ఈ దృశ్యమానమగుచున్న సమస్త విశ్వము ‘‘దత్త’’ (According, Giving) అను బీజముయొక్క అంతర్గతమై (దాగినదై) ఉన్నది.
దత్తాత్రేయ షడక్షరీ బీజ
అట్టి ‘దత్త’ అను శబ్దము ఏకము, అక్షరమూగు ఆత్మతత్త్వము గురించిన వ్యాఖ్యానము. ‘‘దాం’’ అను అక్షరము గురించి వ్యాఖ్యానించుకుంటున్నాము.
(దాం = One who is giving all this : ఇచ్చువాడు)
అట్టి ‘దత్త’ శబ్ద వ్యాఖ్యానమునకు (ఏకమే అయి ఉన్న దానికి) ‘అ’ బీజాక్షరముల సమన్వితము. (‘అ’కారంహి శివాత్ కేవలమ్)

(1) ఓం
(2) శ్రీం
(3) హ్రాం
(4) క్లీం
(5) గ్లౌం
(6) ద్రాం
ఇది ఏకాక్షర, షట్ బీజాక్షర, ‘దత్త’ శబ్దానుసరణము.

‘‘ఓం శ్రీం హ్రాం
క్లీం గ్లౌం ద్రాం’’
(షడక్షరీ బీజమంత్రము)

(అక్షరమగు ఆరు బీజములు)
సర్వ సంపత్ వృద్ధికరో భవతి।
యోగానుభవో భవతి।।
(యోగ-అనుభవో భవతి)।।

ఓం శ్రీం హ్రాం క్లీం గ్లౌం ద్రాం
6
దత్తాత్రేయాయ నమః
6
ఈ షడక్షరీ (6) బీజ మంత్రముయొక్క అర్ధపూర్వకమైన ఉపాసనచే సర్వసంపదలు (భక్తి, జ్ఞాన, వైరాగ్యములు) వృద్ధి చెందగలవు. సర్వాంతర్యామి అగు పరమాత్మతో యోగానుభవము (మమేకత్వము) సిద్ధించగలదు.
గాయత్రీ చ్ఛందః।
సదాశివ ఋషిః।
దత్తాత్రేయో దేవతా।
ద్రమ్ - ఇత్యుక్త్వా,
‘ద్రామ్’ - ఇత్యుక్త్వా వా
‘‘దత్తాత్రేయాయ నమః।’’ (7)
(ద్రం / ద్రాం దత్తాత్రేయాయ నమః)
ఇతి అష్టాక్షరః।
అష్టాక్షరీ దత్తాత్రేయ మంత్రము
‘‘గాయత్రీ’’ - ఛందస్సు।
‘‘సదాశివ’’ - ఋషి।
‘‘దత్తాత్రేయ’’ - దేవత।
‘‘ద్రం - దత్తా త్రేయాయ నమః’’ అనికాని
‘‘ద్రాం-(ద్రం+అ) = దత్తాత్రేయాయ నమః’’-అని గాని ఉపాసించబడుగాక।
ద్రం/ద్రాం దత్తాత్రేయాయ నమః (8)
- ఇది ‘‘అష్టాక్షరీమంత్రము’’ అవుతుంది.
దత్తాత్రేయాయేతి।
‘‘సత్యానంద చిదాత్మకం నమ’’ - ఇతి।
పూర్ణనందైక విగ్రహమ్।
దశ-ఏకాదశాక్షరీ-దత్త
‘‘దత్తాత్రేయాయ’’ - ఇది సత్ ఆనంద చిదాత్మకమగు పూర్ణానంద విగ్రహుడగు సత్య - ఆనంద - చిదాత్మకమునకు నమస్కరించటము.
సత్యానంద చిదాత్మకం నమః (8+2 = 10)
ఓం సత్యానంద చిదాత్మకం నమః (1+8+2 = 11)
గాయత్రీ - చ్ఛందః।
సదాశివ - ఋషిః।
‘దతాత్రేయ’ - దేవతా।
దతాత్రేయా - ఇతి కీలకం।
‘తత్’ ఏవ (తదేవ) - బీజం।
నమః శక్తిః - భవతి।।
‘‘దత్తాత్రేయ నవాక్షరమ్’’
‘‘గాయత్రీ’’ - ఛందస్సు।
‘‘సదాశివ’’ - ఋషి।
‘‘దత్తాత్రేయ’’ - దేవతా।
దత్తాత్రేయ - కీలకమ్।
‘తత్’ ఏవ - బీజమ్।
‘నమః’ - శక్తి।
‘ఓం దత్తాత్రేయాయ నమః।। (8)
ఓం శ్రీదత్తాత్రేయాయ నమః।। (9) - ఇది నవాక్షర మంత్రము
‘ఓం’ ఇతి ప్రథమం। ‘ఆం’ ఇతి ద్వితీయం।
‘హ్రీం’ ఇతి తృతీయం। ‘క్రోం’ ఇతి చతుర్థం।
‘ఏహి’ ఇతి తదైవ వదేత్ -
దత్తాత్రేయేతి। స్వాహేతి।
మంత్ర రాజో-యం
‘‘ద్వాదశాక్షరః’’।।
(ఓం) ‘‘ఆం హ్రీం క్రోం ఏహి - (5)
దత్తాత్రేయేతి స్వాహా’’ - (7)
మంత్రరాజో-యం।
‘‘ద్వాదశాక్షరః (12)।’’
దత్తాత్రేయ ద్వాదశాక్షరమ్
‘‘ఓం ఆం హ్రీం క్రోం
‘‘దత్తాత్రేయేతి’’ స్వాహేతి

ఓం - మొదటిది; ఆం - రెండవది; హ్రీం - మూడవది; క్రోం - నాలుగవది
(ఓం) ఆం హ్రీం క్రోం
3
ఏహి
2
దత్తాత్రేయేతి
5
స్వాహా
2
12
(ఓం) ఆం హ్రీం క్రోం ఏహి దత్తాత్రేయాయ స్వాహా (12)
- ఇది ద్వాదశాక్షరమంత్రరాజము.
జగతీ - ఛందః।
సదాశివ - ఋషిః।
దత్తాత్రేయో - దేవతా।
‘‘ఓం’’ ఇతి బీజం।
‘స్వాహా’’ - ఇతి శక్తిః।
‘‘సంబుద్ధిః’’ - ఇతి కీలకమ్।
‘‘ద్రమ్’’ - ఇతి హృదయే।
‘‘హ్రీం క్లీం’’ - ఇతి శీర్షే।
‘‘ఏహి’’-ఇతి - శిఖాయాం।
దత్త - ఇతి కవచే।
ఆత్రేయ - ఇతి చక్షుషి।
స్వాహా - ఇతి అస్త్రే।
తన్మయో భవతి, య ఏవం వేద।
దత్తాత్రేయ షోడశాక్షరీ మంత్రము

ఓం సంబుద్ధిః ద్రమ్ హ్రీం క్లీం ఏహి దత్తాత్రేయాయ స్వాహా।
[4] ఓం సం బుద్ధిః
[3] ద్రం హ్రీ క్లీం
[2] ఏహి
[5] దత్తాత్రేయాయ
[2] స్వాహా।

===
16
===
‘జగతీ’ - ఛందస్సు।
‘సదాశివ’ - ఋషి
‘దత్తాత్రేయ’ - దేవత।
‘ఓం’ - బీజము।
‘స్వాహా’ - శక్తి।
‘సంబుద్ధిః’ - కీలకమ్।
‘ద్రమ్’ - హృదయే।
‘హ్రీం క్లీం’ - శీర్షము।
‘ఏహి’ - ఇతి శిఖాయ।
‘దత్త’ - కవచము।
ఆత్రేయ - చక్షవులు।
స్వాహా - అస్త్రే।

ఈ షోడశాక్షరీ మంత్రమును ఎరిగినవాడు ‘‘తత్’’చే మయుడు (తన్మయుడు) కాగలడు. తత్ - ఆనందస్వరూపుడై ప్రకాశించగలడు.
‘‘షోడశాక్షరం వ్యాఖ్యాసే’’ (16)
‘‘ప్రాణం’’ దేయం।
‘‘మానం’’ దేయం।
చక్షుః దేయం। శ్రోత్రం దేయం।
షట్ దశ (షడ్డశ) శిరః ఛినత్తి।
షోడశాక్షర (16) మంత్రో న దేయో భవతి।
అతిసేవాపర భక్త గుణవత్ శిష్యాయ వదేత్।
షోడశ (16) అక్షర వ్యాఖ్యానము
అర్హత లేనివానికి ఈ షోడశాక్షరీ మంత్రమును అనుష్ఠింపజేయరాదు.
ప్రాణమైనా, మానమైనా, చక్షవులైనా, చెవులైనా ఇవ్వవచ్చునేమో।
16 సార్లు శిరస్సును నరికి ఈయవచ్చునేమో। అంతేగానీ - అర్హత లేకపోతే షోడశాక్షరీ మంత్రము ఇవ్వరాదు.
సేవా నిరతిగలవాడగు భక్తునికి, సద్గుణవంతుడు అగు శిష్యునికి మాత్రమే - ఈ షోడశాక్షరీమంత్రము ప్రసాదించబడుగాక।
‘ఓం’ - ఇతి ప్రథమం భవతి।
‘ఐం’ - ఇతి ద్వితీయం।
‘క్రోం’ - ఇతి తృతీయం।
‘క్లీం’ - ఇతి చతుర్థం।
‘క్లూం’ - ఇతి పంచమం
‘హ్రాం’ - ఇతి షష్ఠం।
‘హ్రీం’ - ఇతి సప్తమం।
‘హ్రూం’ - ఇతి అష్టమం।
‘సౌః’ - ఇతి నవమం।
‘‘దత్తాత్రేయాయ’’ - ఇతి - చతుర్దశ। (14)
‘స్వాహా’ ఇతి షోడశ। (14+2 = 16)
శ్రీ దత్తాత్రేయ బీజరూప షోడశాక్షరీ మంత్రము
(1) ఓం
(2) ఐం
(3) క్రోం
(4) క్లీం
(5) క్లూం
(6) హ్రాం
(7) హ్రీం
(8) హ్రూం
(9) సౌః
దత్తాత్రేయేతి।[5]
స్వాహా।[2]

‘‘9+5+2 = 16’’
[5] <ఓం> ఐం క్రోం క్లీం క్లూం
[4] హ్రాం హ్రోం హ్రూం సౌః
[5] దత్తాత్రేయాయేతి
[2] స్వాహా।

===
16
===
గాయత్రీ చ్ఛందః।
సదాశివ ఋషిః।
దత్తాత్రేయో దేవతా।
ఓం - బీజం।
స్వాహా - శక్తిః।
చతుర్థ్యంతం - కీలకం।
‘ఓం’ - ఇతి హృదయే।
‘క్లాం క్లీం క్లూం’ - ఇతి శిఖాయాం।
‘సౌః। - ఇతి కవచే।
చతుర్థ్యంతం చక్షుషి స్వాహా-ఇతి - అస్త్రే।
యో నిత్యం అధీయానః
సచ్చిదానంద సుఖీ మోక్షీ భవతి।।
శ్రీ దత్తాత్రేయ చతుర్దశాక్షరీ
గాయత్రీ ఛందస్సు।
సదాశివ ఋషి।
దత్తాత్రేయ దేవతా।
ఓం బీజం।
స్వాహా శక్తి।
చతుర్థ్యంతం కీలకం।
ఓం ఇతి హృదయాయనమః।
క్లాం శిరసే స్వాహా।
క్లీం క్లూం శిఖయాయ వషట్
సౌః కవచాయు ‘హుమ్’।

చతుర్ధ్యంతం చక్షుసి స్వాహా ఇతి అస్త్రే। - నేత్రత్రయాయ వౌషట్।
[5] ఓం క్లాం క్లీం క్లూ సౌః
[7] చతుర్థంతం చక్షుషి
[2] స్వాహా

===
14
===
ఈ విధంగా - ఎవరు నిత్యము ఉపాసిస్తారో, - అట్టివాడు సచ్చిదానంద సుఖి, మోక్షి అగుచున్నాడు.
‘‘సౌః’’ ఇత్యంతే - ‘శ్రీవైష్ణవ’ ఇతి ఉచ్యతే-
తత్ జాపీ ‘విష్ణురూపీ’ భవతి।।
అనుష్టుప్ - ఛందః
వ్యాఖ్యాస్యే, ‘‘సర్వత్ర సంబుద్ధిః
ఇమాని’’ - ఇతి ఉచ్యంతే।
‘‘సౌః’’ అను అక్షరమున చివర (అర్ధమాత్రగా) ‘శ్రీవైష్ణవ’ అనబడుతోంది.
దీనిని జపించువాడు ‘విష్ణురూపి’’ అగుచున్నాడు
ఛందస్సు - అనుష్టుప్।
సర్వత్ర సత్‌భావనా బుద్ధి - వ్యాఖ్యానము.
బ్రాహ్మీబుద్ధియే ‘‘దత్తాత్రేయము’’గా చెప్పబడుతోంది।
ఓం క్లాం క్లీం క్లూ సౌః
5
శ్రీవైష్ణవ చక్షుషి
7
స్వాహా
2
14
దత్తాత్రేయ హరేకృష్ణ
ఉన్మత్తానంద దాయక, దిగంబరమునే
బాలపిశాచ జ్ఞానసాగరేతి।।
ఇతి ఉపనిషత్
మంత్రము
దత్తాత్రేయ హరేకృష్ణ ఉన్మత్తానందదాయక       4+4+8=16
దిగంబరమునే - బాలపిశాచ జ్ఞాన సాగరాత్।   6+5+2+3=16

ఇది (32 అక్షరముల) పరమాత్మ సమీప్యరూపమగు ఉపనిషత్
అనుష్టుప్ - ఛందః।
సదాశివ - ఋషిః।
దత్తాత్రేయో - దేవతా।
దత్తాత్రేయేతి - హృదయే।
హరేకృష్ణ - ఇతి శీర్షే।
ఉన్మత్తానందేతి - శిఖాయామ్।
దాయకమ్ - ఇతి కవచే।
దిగంబర-ఇతి-చక్షుపి।
పిశాచజ్ఞానసాగర - ఇతి అస్త్రే।
అనుష్టుభో అయం మయా అధీతః-
ఆబ్రహ్మ-జన్మ దోషాశ్చ ప్రణశ్యంతి।
సర్వోపకారీ మోక్షీ భవతి-
య ఏవం వేద।।
ఇతి ఉపనిషత్

శ్రీ దత్తాత్రేయ షోడశ బీజాక్షరీ స్వాహామంత్రము
‘అనుష్టుప్’ - ఛందస్సు।
‘సదాశివ’ - ఋషి।
‘దత్తాత్రేయ’ - దేవతా।
దత్తాత్రయేతి - హృదయే।
హరేకృష్ణ - ఇతి శీర్షమ్।
ఉన్మత్తానంద - ఇతి శిఖాయ।
దాయకమ్ - ఇతి కవచమ్।
దిగంబర - ఇతి చక్షుపి।
పిశాచజ్ఞానసాగర - ఇతి అస్త్రే।

శ్రద్ధగా అనుష్ఠించబడు ఈ అనుష్టుభ్ యొక్క ఉపాసనచే - పుట్టినప్పటి నుండి చేసిన దోషములు నశించగలవు.
మంత్రార్థమును తెలుసుకున్నవాడు సర్వులకు శ్రేయోభిలాషి అగుచున్నాడు. మోక్షము సిద్ధించుకోగలడు.
షోడశాక్షర మహామంత్రము-బీజాక్షర సమన్వితము

ఓం ఐంక్రోం క్లీం క్లూం హ్రాం హ్రీం

హ్రూం సౌః దత్తాత్రేయాయ స్వాహా।
7

9

= [16 అక్షరములు]

ఇతి ప్రథమఖండః -ఇత్యుపనిషత్-


ద్వితీయ ఖండః

‘ఓం
1. ‘ఓం’ ఇతి వ్యాహరేత్।
‘ఓం నమో భగవతే దత్తాత్రేయాయ’
స్మరణమాత్ర సంతుష్టాయ।
మహాభయ నివారణాయ।
‘ఓం’ అని ముందుగా సర్వాంతర్యామి, సర్వతత్త్వస్వరూపుడు-అగు పరమాత్మను స్మరిస్తూ
ఓం నమో భగవతే దత్తాత్రేయాయ (12)
హే భగవాన్। దత్తాత్రేయాయ। స్మరించినంతమాత్రం చేత సంతుష్టుడు అగు స్వామీ।
- మహాభయమును తొలగించి నివారణము చేయు దేవా।
మహాజ్ఞాన ప్రదాయ।
చిదానందాత్మనే।
బాల-ఉన్మత్త-పిశాచ వేషాయేతి
మహాయోగినే అవధూతాయేతి।
- మహత్ - ఆత్మగురించిన జ్ఞానము ప్రసాదించు దేవాదిదేవా।
- (కేవలమగు ఎరుకను) ఆనందస్వరూపముగా కలిగియున్న చిదానంద స్వరూపా।
- బాహ్యానికి బాలునివలె, పిచ్చివానివలె, పిశాచివలె వేషము ధరించి అజ్ఞానులగు మమ్ములను భ్రమింపజేయువాడా।
- మహాయోగీ। అవధూతా।
అనసూయానంద వర్ధనాయ
అత్రి పుత్రాయేతి।
సర్వకామఫలప్రదాయ।
- తల్లి అనసూయకు పుత్రానందము కలిగించువాడా।
- అత్రిమహర్షి కుమారా।
- సమస్త కోరికలు సిద్ధించు అవధూతా! నమో నమః
‘ఓం’ - ఇతి వ్యాహరేత్ -
భవబంధ మోచనాయేతి।
‘ఓం’ అను వ్యహరించుటచే (ఉచ్ఛరించుటచే) ఈ జగత్తు నిజమే - అనే బంధము నుండి విమోచనమునకై ఉచ్చారణా-సంసిద్ధతకు పూనుకొను చున్నాము. (భవ బంధ విమోచనాక్షరము)
‘హ్రీం’ ఇతి వ్యాహరేత్ -
సకల విభూతిదాయేతి।
‘‘హ్రీం’’ - పలుకుటచే - సమస్త విభూతులు - తనవైన పరమాత్మస్మరణము.
- దృశ్య-దేహ-మనో-బుద్ధి-చిత్త-అహంకారముల ప్రదాత అగు దత్తస్వామికి నమస్కారము. (పరతత్త్వస్మరణము)
‘క్రోం’ ఇతి వ్యాహరేత్ -
సాధ్యాకర్షణాయేతి।
‘‘క్రోం’’ శ్రేష్ఠమైన ఆకర్షణవంతుడు, సమస్తము తనవైపు ఆకర్షిస్తున్నవాడు అగు సర్వాత్మకునకు నమస్కారము. (పరమాత్మవైపుగా చిత్త నియామకము)
‘సౌః’ ఇతి వ్యాహరేత్ -
సర్వమనః క్షోభణాయేతి।
‘సౌః’ - సర్వజీవుల మనస్సులనుక్షోభణాయుతము చేయు పరంధామునకు నమస్కారము. (విషయములనుండి మనోఉపసంహరణము)
‘శ్రీం’ ఇతి వ్యాహరేత్।
సర్వ సంపత్ ప్రదాయేతి।
‘శ్రీం’ - అను వ్యాహృతిచే సర్వ సంపత్ ప్రదాత.
మహఓం (మహోమ్) ఇతి వ్యాహరేత్
చిరంజీవినే।
‘మహత్ ఓం’ వ్యాహరణముచే చిరంజీవ స్వరూపమగు, ఆత్మానంద స్వరూప- దత్తాత్రేయునకు నమస్కారము.
ఓ దత్తాత్రేయ స్వామీ! ‘మహ ఓం’ అను మీ శాశ్వత మహత్ తత్త్వమునకు ప్రణామములు.
వషట్ ఇతి వ్యాహరేత్
వశీకురు। వశీకురు।
వషట్ వ్యాహృతి ఉపాసనలచే మా సమస్తము మీకు సమర్పిస్తున్నాము. వషట్ వ్యాహృతి స్వీకరించి మమ్ములను వశము చేసుకోండి. వశము చేసుకోండి. మా మనస్సును వశము చేసుకోండి. బుద్ధికి ప్రత్యక్షమయెదరు గాక।
‘వౌషట్’ ఇతి వ్యాహరేత్
ఆకర్షయ। ఆకర్షయ।
స్వామీ! ‘వౌషట్’ అను వ్యాహృతి (వచనము) చే మమ్ములను ఆజ్ఞానంధ కారము నుండి ఈవలకు ఆకర్షించండి. ఆకర్షించండి.
‘హుం’ ఇతి వ్యాహరేత్
విద్వేషయ। విద్వేషయ।
‘హుం’ వ్యాహృతి స్వీకరించుచు (మాకు అరిషట్ వర్గముపట్ల, మా అజ్ఞాన అభ్యాసములపట్ల) విద్వేషము కలుగచేయండి.
‘ఫట్’ ఇతి వ్యాహరేత్
ఉచ్చాటయ। ఉచ్చాటయ।
‘‘ఫట్’’ వ్యాహృతిచే (పలుకుచే) మాలోని అల్పభావములను మొదలంట్లా వ్రేళ్ళతోసహా పెకలించివేయండి.
‘‘ఠఠేతి’’ (ఠ ఠ-ఇతి) వ్యాహరేత్
స్తంభయ। స్తంభయ।
‘‘ఠఠ’’ వ్యాహృత్ (వచనము)చే (మా లోని మనోచాంచల్యమును) స్తంభింపజేయండి.
‘‘ఖఖేతి’’ (ఖ ఖ - ఇతి) వ్యాహరేత్
మారయ। మారయ।
‘ఖేఖే’ అను మా వ్యాహృతి (పలుకలను) అనుసరించి (మా లోని దుష్ట అభ్యాసములను) నశింపజేయండి.
నమః సంపన్నాయ। -
నమః సంపన్నాయ స్వాహా।
పోషయ। పోషయ।
ఓ దత్తాత్రేయా!
ఈ సమస్త జగత్తు మీ సంపదయే। సంపన్నాయా। సమస్తము సంపదగా కలవాడా। మా దైవీ సంపదను పరిపోషించండి.
పరమంత్ర పరయంత్ర
పరతంత్రాం ఛింధి ఛింధి।
మాకు భేదము కలిగించగల అన్యత్వము కలుగజేయు మంత్ర యంత్ర తంత్ర దోషములను మమ్ములను బాధించకుండా ఖండించండి. (ఛింది = నరకటము)
గ్రహాన్ నివారయ। నివారయ।
వ్యాధిం నివారయ। నివారయ।
హే దత్తాత్రేయా! మేము సమర్పించు కర్మ-జ్ఞాన-యోగ ఉపాసనలను అభ్యాసములుగా స్వీకరించి
⌘ మాపట్ల గ్రహదోషములను నివారించండి.
⌘ శారీరక మానసిక వ్యాధి, ఆధులను తొలగించండి
దుఃఖం హరయ। హరయ।
దారిద్ర్యం విద్రావయ। విద్రావయ।
దేహం పోషయ। పోషయ।
చిత్తం తోషయ। తోషయ।
⌘ మాయొక్క దుఃఖములను (worries) హరించి వేయండి.
⌘ దారిద్రమును విద్రావయము (పారిపోయేటట్లు) చేయండి.
⌘ ఈ మా శరీరములను పరిపోషిస్తూ రక్షించండి.
⌘ మా చిత్తమును సంతోషింపజేయండి. ఆత్మభావన వైపు తరలించం&.
సర్వమంత్ర సర్వయంత్ర సర్వతంత్ర
సర్వపల్లవ సర్వ రూపాయేతి
ఓం నమః శివాయేతి।।
(ఓం నమశ్శివాయ)
సర్వమంత్ర యంత్ర తంత్ర పల్లవ (చిగురించు) సర్వరూపాయ। ఓం నమశ్శివాయ। ఓం నమశ్శివాయ।

నమో నమః। నమో నమః। -
ఇతి ద్వితీయ ఖండః। ఇతి-ఉపనిషత్।


తృతీయ ఖండః - అష్టమూర్తి। ఫలశ్రుతి।

య ఏవం వేద
అనుష్టుప్ - ఛందః
సదాశివ - ఋషిః।
దత్తాత్రేయో - దేవతా।
‘ఓం’ - ఇతి బీజం।
‘స్వాహా’-ఇతి-శక్తిః।
ద్రాం - ఇతి కీలకం।
అష్టమూర్తీ అష్టమంత్రా భవంతి।
దత్తాత్రేయ - అష్టమూర్తి - అష్టాక్షరీ అష్ట మంత్రము
‘‘ఓం దత్తాత్రేయాయ స్వాహా।’’ (8)
‘‘ద్రాం దత్తాత్రేయాయ స్వాహా।’’ (8)
ఛందస్సు - ‘అనుష్టుప్’।
ఋషి - సదాశివ।
దేవతా - దత్తాత్రేయో। ‘ఓం’ - ఇతి బీజము। ‘స్వాహా’-ఇతిశక్తి।
ద్రాం - ఇతి కీలకం।
ఇవి అష్టమూర్తి యొక్క అష్టమంత్రములు అగుచున్నాయి.
యో నిత్యమ్ అధీతే -
వాయుః అగ్ని సోమ ఆదిత్య
బ్రహ్మ విష్ణు రుద్రైః పూతో భవతి।
గాయత్ర్యాః శతసహస్రం జప్తో భవతి।
మహారుద్ర శత సహస్ర జాపీ భవతి।
ప్రణవాయుత కోటి జప్తో భవతి।
శతపూర్వాన్ శత ఉత్తరాన్ పునాతి।
ఎవరు ఈ దత్తాత్రేయోపనిషత్ నిత్యము పఠిస్తారో - అట్టి వారు వాయు, అగ్ని, సోమ, ఆదిత్య, బ్రహ్మ, విష్ణు, రుద్ర తేజస్సులచే పవిత్రులు అగుచున్నారు.
శతసహస్ర (లక్షలసార్లు) గాయత్రీ జపము చేసిన ఫలము లభించగలదు.
లక్షసార్లు మహారుద్రమంత్రము జపించినవారు అగుచున్నారు.
అట్టివారు వంద కోట్ల సార్లు ప్రణవము జపించిన వానితో సమానము.
ఆతడు ఉన్నచోట వెనుక 100 మంది ముందు 100 మంది పవిత్రులు కాగలరు.
సపంక్తి పావనో భవతి।
బ్రహ్మహత్యాది పాతకైః ముక్తో భవతి।
గోహత్యాది పాతకైః
ముక్తో భవతి।
అట్టి వారు ఏ పంక్తి (వరుస)లో ఉంటే ఆ పంక్తి పావనము అవగలదు.
బ్రహ్మహత్య వంటి మహా పాతక దోషములనుండి ముక్తులు అగుచున్నారు.
గోహత్య వంటి ఘోర పాతకముల దోషములనుండి కూడా విమోచనము పొందగలరు.
తులా పురుషాది దానైః
ప్రపాపానతః పూతో భవతి।
అశేష పాపాన్ ముక్తో భవతి।
అభక్ష్య భక్షణ పాపైః ముక్తో భవతి।
సర్వమంత్ర యోగ పారీణో భవతి।
స ఏవ బ్రాహ్మణో భవతి।
ఈ ఉపనిషత్తు పారాయణము-అధ్యయనము చేయువారికి తులాపురుష (తులాభారదానము - తాను ఉన్నంత బరువుగా బెల్లముగాని, వెండి - బంగారములు వంటివిగాని) దానము, సమర్పణము చేసిన ఫలము లభించగలదు. తనను తానే పరమాత్మకు సమర్పించిన ప్రపన్న పుణ్యఫలము పొందగలడు. పవిత్రుడవగలడు.
అంతులేని పాపములను చేసియున్నా కూడా మిక్కిలి విడివడినవాడు అగుచున్నాడు. తినకూడనిది తినిన పాపమునుండి విమోచితుడు కాగలడు.
సర్వ మంత్రములను అనుష్ఠించినవానితో, సర్వయోగములను అభ్యసించిన వానితో సమానుడుకాగలడు.
బ్రహ్మమును అధ్యయనము చేసి, ఎఱిగి, బ్రహ్మమే తానని గమనిస్తున్న ‘బ్రాహ్మణుడు’ అగుచున్నాడు.
తస్మాత్ శిష్యం, భక్తం
ప్రతిగృహీణాయాత్ -
సో అనంత ఫలమ్ అశ్నుతే।
సజీవన్ముక్తో భవతి।।
శిష్యుడైనవానికి, భక్తిగలవానికి ఈ దత్తాత్రేయోపనిషత్ పరమార్థమును బోధించుటచే - ఆ స్వీకరించినవాడు, ఆ గురువు కూడా ఉత్తమ ఫలములు పొందగలరు.
ఈ ఉపనిషత్ పఠించుటచేత, పారాయణము చేయుటచేత - అట్టివాడు సాక్షాత్ ‘జీవన్ముక్తుడు’ కాగలడు.
ఇతి ఆహ భగవాన్ నారాయణో బ్రహ్మాణమ్।।
ఈ విధంగా భగవంతుడగు శ్రీమన్నారాయణుడు - సృష్టి సంకల్పి, సృష్టికర్త అగు బ్రహ్మదేవునికి వివరించి బోధించారు.

ఇతి తృతీయ ద్వితీయ ఖండః।

🙏 ఇతి దత్తాత్రేయోపనిషత్ సమాప్తా।।
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।


అధర్వణ వేదాంతర్గత

9     దత్తాత్రేయ ఉపనిషత్

అధ్యయన పుష్పము

పౌరాణిక విశేషాలు

అనసూయాదేవి - అత్రిమహర్షుల అనువారు పుణ్యదంపతులు. వారి కుమారుడు శ్రీదత్తాత్రేయ అవధూత।

అనసూయాదేవి (మార్కండేయ పురాణము):

దేవహుతి - కర్దముల కుమార్తె. అత్రి మహర్షి భార్య, మహాపతివ్రత. భర్తనే పరమాత్మగా పూజిస్తూ వారివద్ద జ్ఞానోపదేశము పొందియున్నారు.

(పంచమహాపతివ్రతలు = సీత, సావిత్ర, అనసూయ, ద్రౌపతి, దమయంతి)

ఒక సందర్భములో బ్రహ్మ-విష్ణు-మహేశ్వరులు తమ తమ వాహనములైనట్టి హంస-గరుడ-నందీశ్వరులపై అధిరోహించినవారై ఆకాశంలో మేరుపర్వతము వైపుగా పోవుచూ ఉన్నారు. ఒకచోట వారి వాహనములు ఆగిపోయాయి. ఎంతగా ప్రయత్నించినప్పటికీ ముందుకు సాగలేదు. గరుడుడు అది గమనించి, జ్ఞానదృష్టితో విషయము ఏమిటో తెలుసుకొన్నారు. త్రిమూర్తులతో - ‘‘హే త్రిమూర్తి దేవాది దేవులారా! ఇచ్చటనే అత్రి మహర్షి ఆశ్రమము. వారి ధర్మపత్ని అనసూయాదేవి మహాపతివ్రత. ఈ మార్గములో మనము దాటజాలము. ఆ తల్లి పాతివ్రత్యమహిమ అటువంటిది’’ అని విన్నవించారు. అది విని వారు వెనుకకు వచ్చి వేరే మార్గంగా మేరు పర్వతము వైపుగా ప్రయాణించారు.

ఆ తరువాత త్రిమూర్తులు ‘‘మనము అనసూయాదేవి పాతివ్రత్యమును పరీక్షించి, పాతివ్రత్య మహిమ ఎట్టిదో త్రిలోకములకు దృష్టాంతంగా చూపుదాము. తద్వారా ధర్మముయొక్క ఔన్నత్యము కూడా జనులకు పాఠ్యాంశము కాగలదు’’ - అని నిర్ణయించుకున్నారు.

త్రిమూర్తులు బ్రాహ్మణరూపులై అత్రిమహర్షి ఆశ్రమము ప్రవేశించారు. అనసూయ-అత్రి దంపతులు ఆ ముగ్గురు బ్రాహ్మణులను అతిథులుగా లోనికి ఆహ్వానించి ఆతిధ్యమిచ్చారు. ముగ్గురు స్నానానికి వెళ్లబోతూ, ‘‘ఓ అత్రిమహర్షీ। మాముగ్గురికి భోజనము వడ్డించు స్త్రీ దిగంబరీయి ఉండాలి. ఇది మా వ్రతము. ఇది కుదరకపోతే చెప్పండి. మాకు శలవు ఇప్పించండి. వెళ్లివస్తాము’’ - అని పలికారు.
ఆ మాటలు విని అత్రిమహర్షి ప్రశాంతముగా ధర్మపత్ని అనసూయవైపు - ‘‘ఇప్పుడు ఏమి చేద్దాము?’’ అన్నట్లుగా చూచారు. అనసూయాదేవి ‘‘స్వామీ! సరే! అట్లాగే ఆతిధ్యము పూర్తి చేద్దాము’’ - అని పలికారు.

ముగ్గురు బ్రాహ్మణులు స్నానము చేసివచ్చి పీటలమీద భోజనానికై కూర్చున్నారు. అనసూయ ఆ అతిథులకు నమస్కరించి, వారిపై మంత్రాక్షతలు, జలము చల్లారు. అంతే"! ఆ ముగ్గురు అప్పుడే పుట్టిన శిశువులవలె అయిపోయారు. అప్పుడు భోజనము వడ్డించి, ఆ తరువాత ముగ్గురు శిశువులపై మంత్రాక్షతలు, జలము చల్లారు. తిరిగి ఆ ముగ్గురు బ్రాహ్మణ రూపములు పొందారు. వారింక భోజనము చేయసాగారు.

భోజనము చేసిన తరువాత ఆ దేవి వారిపై మరల మంత్రాక్షతలు, జలము చల్లి పసిబిడ్డలుగా మార్చి తన ఆశ్రమములోనే ఆడిస్తూ, మాతృవాత్యల్యముతో ఆనందించసాగారు.

అప్పుడు సరస్వతి, లక్ష్మి, ఉమలులు తమతమ భర్తలను వెతుక్కుంటూ రాగా, మరల ఆ ముగ్గురిపై మంత్రజలము చల్లి తిరిగి అభ్యాగత బ్రాహ్మణరూపులుగా చేసారు.

అది చూచి మెచ్చుకొన్న త్రిమూర్తులు తమ నిజస్వరూపము చూపించి వరము కోరుకోమన్నారు. అనసూయ ‘‘త్రిమూర్తులారా। మాకు సంతానము లేదు! మీతో సమానమైన పుత్రులను ప్రసాదించండి’’ అని ప్రార్థించారు.

అట్టి త్రిమూర్తుల అవతారములే -
బ్రహ్మ అంశగా - చంద్రుడు.
విష్ణు అంశగా - దత్తాత్రేయుడు. (వీరు త్రిమూర్తుల అంశ కూడా).
శివాంశగా - దుర్వాసమహర్షి.
జన్మించారు. వారు ముగ్గురు లోకకల్యాణమూర్తులైనారు.

రామాయణము :

పూర్వము ఒకప్పుడు భూమిపై క్షామము సంభవించింది. భూమిపై వృక్షములు ఫలములు ఇవ్వలేకపోయాయి. జీవులంతా ఎంతో దుఃఖితులైనారు. అప్పుడు భూదేవతయొక్క, మహర్షులయొక్క అభ్యర్ధనను అనుసరించి, తనయొక్క పాతివ్రత్యమహిమతో అనసూయ భూమిపై ఏర్పడిన క్షామమును నివారించారు. అప్పుడు వృక్షములు తిరిగి పుష్పించటము, ఫలములు ప్రసాదించటము నిర్వర్తించసాగాయి.
వనవాసము సందర్భములో సీతారామలక్ష్మణులు అత్రిమహర్షి ఆశ్రమును సందర్శించారు. అప్పుడు అనసూయాదేవి స్త్రీలకు మోక్షప్రసాదమగు ‘సతీధర్మములు’ గురించి బోధించారు. ఆ విధంగా బోధించిన ‘‘భారతనారీ ఉత్తమలక్షణములు, అర్ధాంగి - ధర్మపత్ని - సహధర్మచారిణి - గృహిణి - శబ్దార్థములు, పాతివ్రత్య ధర్మములు, స్త్రీలు నిర్వర్తించి సిద్ధిపొందగల అనేక వ్రతములు’’ - మొదలైనవన్నీ భారత దేశములో అనుసరణీయములై కొనసాగుచూ ఉన్నాయి కూడా! భారతీయ సంస్కృతిలోను, కుటుంబ వ్యవస్థలోను అంతర్లీనమై, - ప్రపంచమంతటికీ ఆదర్శప్రాయమగుచున్నాయి.

అత్రిమహర్షి (భాగవతము) :

సప్తర్షులలో ఒకరు - బ్రహ్మమానసపుత్రుడు. సంతానము కొరకు ధర్మపత్ని అనసూయాదేవితో కూడి తపస్సు చేయగా త్రిమర్తులు వరప్రసాదంగా - వారి ముగ్గురి ఏకాంశగా దత్తాత్రేయుడు కుమారుడుగా కలిగారు. ఆయన ఆత్మజ్ఞాన ప్రకాశముచే అవధూత అయినారు.

భారతము :

ఒకప్పుడు అత్రిమహర్షి తపస్సుకొరకై పోబోవుచుండగా, అనసూయాదేవి ‘‘నాధా! మరి మన బిడ్డలకు రక్షణకై ఎవరుంటారు?’’ అని విన్నపము చేసారు. అప్పుడు అత్రి ‘‘రాజుయొక్క బాధ్యత అది’’ అని పలికి, పృథుమహారాజు దగ్గిరకు వెళ్లారు. ‘‘నీవు విధాతవు। ఇంద్రుడవు’’ అని పలికారు. అది విని, అక్కడ ఉన్న గౌతమహర్షి ‘‘ఈ పృథుమహారాజు - విధాత ఇంద్రుడు ఎట్లా అవుతారు? మీరు ముఖస్తుతి మాటలు ఎందుకు చెప్పుచున్నారు?’’ అని ప్రశ్నించారు. అప్పుడు వారి ఇద్దరి మధ్య సనత్కుమారుని సమక్షంలో వాదోపవాదములు జరిగాయి. ఆ వర్ణన - యుక్తియుక్తిమే - అని అత్రిమహర్షి వాదనను సనత్కుమారుడు ఆధ్యాత్మికార్థంగా ఒప్పుకున్నారు. అప్పుడు పృథువు అత్రికి ధనము, కుటుంబ రక్షణ సమర్పించారు.

బ్రహ్మాండపురాణము:

ఒకప్పుడు రాహువు సూర్యుని మ్రింగటానికి సమీపించసాగారు. అప్పుడు సూర్యుడు గజగజ వణుకుచు, క్రిందపడిపోసాగారు. లోకాలన్నీ చీకటి క్రమ్మసాగాయి. అది గమనించిన అత్రిమహర్షి సూర్యుని సమీపించి ‘‘నీ యథాస్థానమునకు భయమెక్కడిది? నీయొక్క స్వయంప్రకాశమునకు లోటేమున్నది? రాహువు యొక్క రాక - పోకలు కాలచమత్కారము మాత్రమే. నీవో, నిత్యాత్మ సూర్యోదయుడవు’’ - అని ఆత్మతత్త్వపరంగా బోధించారు. ‘‘జీవోబ్రహ్మేతి’’ అను శాస్త్రార్థం పలికారు.
అది విని సూర్యుడు స్వస్వరూపజ్ఞాని అయి, తేజోవంతుడుగా ఆకాశమున స్వస్థానమునకు చేర్చారు.
బ్రహ్మపురాణము : ఒక సందర్భములో అత్రిమహర్షి బ్రహ్మ కూడా అయి, బ్రహ్మస్థానమున ఉండటం జరిగింది.

దత్తాత్రేయుడు:

త్రిమూర్తుల ఏకాంశగా అనసూయ - అత్రిమహర్షులకు దత్తాత్రేయుడు కుమారుడై జన్మించారు. విష్ణుమూర్తి ఒకప్పుడు అత్రిమహర్షికి ప్రత్యక్షమై, ‘‘మీ తపస్సుకి మెచ్చి, మీకు దత్తుడను అగుచున్నాను’’ అని పలికి ఉండటంచేత - ఈయన ‘‘దత్తాత్రేయులు’’ అని పిలువబడ్డారు.

విష్ణ్వంశతో పుట్టిన దత్తాత్రేయుల వారి భార్య పేరు లక్ష్మి. దత్తాత్రేయులవారు ఒకప్పుడు ప్రహ్లాదునకు, వైరాగ్యము పొందియున్న అలర్క మహారాజుకు ఆత్మజ్ఞానము బోధించారు.

దత్తాత్రేయులు అవధూత. ఆయనను తత్త్వజ్ఞానము కొరకై ఆశ్రయించినవారికి పరీక్ష చేస్తూ ఉంటారు. సాంసారిక దృష్టి కలవారికి ఆయన ఉన్మత్తునివలె (పిచ్చివానివలె) స్త్రీలోలునివలె, వ్యసనపరునివలె కనిపిస్తారు. పట్టుదలతో సేవించినవారికి ఆత్మబోధ ప్రసాదిస్తారు.

నాలుగువేదములలోని ‘‘పురుషోత్తముడు, పరమాత్మ’’ లక్షణములు స్వాభావికం చేసుకొన్న మహనీయులు.

మార్కండేయ పురాణము:

ఒకప్పుడు కొందరు మునికుమారులు దత్తాత్రేయుని సేవించటానికై ఆయనను సమీపించారు. ఆయనకు అనేక పరిచర్యలు చేయసాగారు. దత్తాత్రేయులవారు ఒంటరిగా ఉండదలచి, ఒక కొలనులో ప్రవేశించారు. ముని కుమారులు కొలను ఒడ్డున వేచి ఉండసాగారు. అప్పుడు దత్తాత్రేయులు ఒక సుందరమైన స్త్రీని వెంటనిడుకొని, ఆమెతో సరసాలు ఆడసాగారు. అయినా కూడా, ఆ మునికుమారులు స్వామిని వీడలేదు. అప్పుడు ఆ మునికుమారులు చూస్తూ ఉండగానే, - ఆ స్త్రీతో దత్తాత్రేయులవారు సంభోగించసాగారు. అది చూచి ఆ మునికుమారులు ‘‘ఈయన మనకు ఆత్మబోధ ఏమి చెపుతారు?’’ - అని తలచి ఆయనను విడచి తమతమ ఆశ్రమములకు వెళ్ళిపోయారు. (ఆత్మజ్ఞానబోధకు అర్హత పొందలేకపోయారు)

భాగవతము / మార్కండేయపురాణము :

వింధ్య పర్వతసమీపంగా ఉండే మహిష్మతీపుర -హైవయవంశపురాజు, కృతవీర్యుని కుమారుడు - కార్తవీర్యార్జునుడు. ఈతడు ‘గర్గుడు’ అను రాజపురోహితునిచే బోధింపబడినవాడై దివ్యశక్తులకొరకై దత్తాత్రేయులవారిని శిష్యుడుగా ఆశ్రయించారు. ఆయనను సేవించసాగారు.

ఒకరోజు..
దత్తాత్రేయుడు : కార్తకీర్యార్జునా! నీవు మహిష్మతీపుర రాజువు. ఇక నేనో? పిచ్చివాడినని జనులంతా అనుకుంటూ ఉంటారు. ఎక్కడో ఏకాంతంగా 4 కుక్కలను వెంటబెట్టుకొని తిరుగుతూ ఉంటాను.పైగా స్త్రీలోలుడను. నాకు మంత్రాలు రావు. తంత్రాలు రావు. నన్నెందుకయ్యా ‘శిష్యుడిని’ అని చెప్పుకొని ఆశ్రయిస్తావు? మీ రాజ్యాలలో ఆశ్రమవాసులైన రాజగురువులను పట్టుకో. వాళ్లు నీకు కావలసినవేమైనా ఉంటే - అవి ఇస్తారు. నేను త్రాగుబోతును. స్త్రీలోలుడను. నాకు సేవచేస్తే నీకేమి లాభం?

కార్తవీర్యార్జునుడు : స్వామీ! మా దేశములోని వేద పండితులందరూ ‘‘వేదములు కుక్కల రూపంగా దత్తాత్రేయుల వారిని ఆశ్రయించి ఉంటాయి’’ - అని చెపుతారు. మిమ్ములను ఆశ్రయించవలసినదిగా మా పెద్దల ఆజ్ఞ. మేము ‘దృశ్యభావన’ అనే వ్యసనముచే ‘మాయ’ అనే మత్తు ఎక్కి ఉన్న దౌర్భాగ్యులము. మీరో? సాక్షాత్ విష్ణు భగవానుని అవతారపురుషులు. మీరు ‘‘అవధూత’’ అని మా పండితుల నిర్ణయము.

(అవధూత = ‘‘జగత్తు’’ అను వ్యవహారమంతా ఆత్మ తత్త్వమునందు త్రోసివేసి, సమస్తమును స్వాభావికంగా ఆత్మానందమునందు ఏకము చేసి ఉండు మహాయోగి / యోగయోగీశ్వరుడు.

అందుచేత మిమ్ములను మనసా, వాచా, కర్మణా సేవించుటయే భక్తి-జ్ఞాన-యోగ-సర్వసమర్పణాభ్యాసముగా నిర్ణయించుకున్నాము. కనుక మీ సేవను నాకు అనుగ్రహించండి.

కొన్నాళ్ళు గడిచాయి. ఒకరోజు దత్తాత్రేయులవారు కార్యవీర్యార్జునిని పిలిచి, ‘‘ఏదీ। నీ భుజములు చూపించు’’ - అని పలికారు. తనయొక్క అపాన వాయువుచే ఆతని భుజములును నల్లగా కాల్చివేసారు. అయినా కూడా ఆ విధంగా నల్లగా మాడిపోయిన భుజములతోనే దత్తాత్రేయుల వారిని సేవించటము కొనసాగించారు.

అప్పుడు కార్తవీర్యార్జుని సేవానిరతి, భక్తి, స్తుతులకు మెచ్చుకొని ఈ విధంగా పలికారు.

దత్తాత్రేయుడు : కార్యవీర్యార్జునా! నిన్ను మెచ్చుకుంటున్నానయ్యా! ఏమి వరం కావలో కోరుకో. అది ప్రసాదిస్తాను.

కార్తవీర్యార్జునుడు : గురువర్యా! దత్తాత్రేయా? మీరు వరం ఇస్తానన్నారుకనుక, మీ భక్తుడనై మిమ్ములను కోరుకుంటున్నాను.
(1) అత్యంత బలోపేతమైన వేయి బాహువులు (భుజములు, చేతులు)
(2) రాజ్యాధికారము
(3) అరివీర భయంకరమైన బల-పరాక్రమములు-అనుగ్రహించ ప్రార్థన.

దత్తాత్రేయులవారు : తథాస్తు। అట్లే అగుగాక। ముల్లోకములలో నీతో సమానమైన బలవంతుడు మరెవ్వరూ ఉండరు. విష్ణు అంశ తప్పితే నిన్ను ఎవ్వరు జయించలేకుండునుగాక। ఇక వెళ్ళిరా! వేయిచేతులతో శివభక్తుడవై శివాభిషేకములు నిర్వర్తించుము.
ఈ విధంగా దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునిని సంతోషపరచి పంపివేసారు.

అట్టి దత్తాత్రేయులవారు జ్ఞాననిధి. కరుణాసముద్రుడు. ‘‘శరణన్నవారిని కాపాడుటము’’ అనే అంతర-హృదయదీక్ష కలవారు. తలచుకొని మనస్సులో నమస్కరిస్తే చాలు, - ఆధ్యాత్మిక భావాలు ప్రసాదించగల జగద్గురువు.

ఈ విధంగా కొన్ని పౌరాణిక విశేషాలు దత్తాత్రేయులవారి గురించి ముచ్చటించుకున్నాము.

ఇక మనము ‘‘దత్తాత్రేయోపనిషత్’’ అధ్యయనములో ప్రవేసిస్తున్నాము.


‘‘శ్రీ గురుదత్త - బీజాక్షర బ్రహ్మవిద్య’’ చే తెలియబడువారు, ‘‘ఆనంద విగ్రహులు’’ - అగు శ్రీపాద నారాయణాకార-శ్రీమన్ -దత్తాత్రేయ స్వామివారిని ఉపాసించుచున్నాము. శరణు వేడుచున్నాము.

జగద్గురు దత్తాత్రేయ

🌹 (దత్-త్‌త్-త్రేయః = ‘తత్’ సహజ ఆత్మ స్వరూపమును ఎలుగెత్తి ప్రకటించు జగద్గురువు।
త్రేయః = త్రిగుణమునకు ఆవలి తత్ దత్ స్వరూపుడు. (‘తత్’ స్వరూపము బోధించువారు).
🌹 దత్ (జీవాత్మను) తత్ - రేయః = ఈ సమస్తమునకు స్వకీయమగు ‘తత్’ యొక్క కిరణముగా కలవారు)
🌹 అత్రి మహర్షికి విష్ణుభగవానునిచే దత్తమైనవారు.


మంత్రరాజములు

సదా దత్తోఽహమస్మి మంత్రము:

సదా దత్తోఽహమస్మీతి ఓం। ఓం సదాదత్తోఽహమస్మి।


సర్వసంపత్ వృద్ధికర షడక్షర (6) దత్తాత్రేయ:

‘ఓం’ ఇతి ప్రథమం। ‘శ్రీం’ ఇతి ద్వితీయం।  
‘హ్రాం’ ఇతి తృతీయం। ‘క్లీం’ ఇతి చతుర్థం।  
‘గ్లౌం’ ఇతి పంచమం। ‘ద్రాం’ ఇతి షష్ఠమ్।

ఓం శ్రీం హ్రాం క్లీం గ్లౌం ద్రాం

మంత్రము -

(ఓం) శ్రీం హ్రాం క్లీం గ్లౌం ద్రాం। భగవతే। దత్తాత్రేయాయ నమః।। 5 + 4 + 5 - 2 (16)


దత్తాత్రేయ అష్టాక్షరీ మంత్రము
(అష్టమూర్తి - అష్టమంత్రా)

ద్రం ‘‘దత్తాత్రేయాయ నమః’’। (8)

ద్రాం ‘‘దత్తాత్రేయాయ నమః’’। (8)


దత్తాత్రేయ సత్యానంద చిదాత్మక మంత్రము

ఓం దత్తాత్రేయేతి సత్యానంద చిద్మాతకం నమః (1 + 5 + 4 + 4 + 2 = 16)


దత్తాత్రేయ బీజాక్షర ద్వాదశాక్షర మంత్రము (12)

ఓం నమో భగవతే దత్తాత్రేయాయ।। (12)

(ఓం) ఆం హ్రీం క్రోం ఏహి    
దత్తాత్రేయేతి స్వాహా

5 + 7 = 12

దత్తాత్రేయ ‘‘బీజ’’ షోడషాక్షరీ మంత్రము (16)

ఓం ఐం క్రోం క్లీం క్లూం హ్రాం హ్రీం హ్రూం సౌః (9)    
దత్తాత్రేయేతి స్వాహా (7)

9 + 7 = 16

దత్తాత్రేయ బీజాక్షర చతుర్ధంత షోడశాక్షరీ।

(ఓం) క్లాం క్లూం సౌః దత్తాత్రేయ చతుర్థంతం (11)
చక్షుపి స్వాహా / స్వాహేతి।। (5)

11 + 5 = 16

దత్తాత్రేయ హరేకృష్ణ మహామంత్రము

(ఓం) దత్తాత్రేయ హరేకృష్ణ ఉన్మత్తానందదాయక।। (16)    
దిగంబరమునే బాల పిశాచ జ్ఞాన సాగరాత్।। (16)

32

- ఇతి ఉపనిషత్-

।।ఓం నమో భగవతే దత్తాత్రేయాయ నమః ।।

దత్తాత్రేయ - ‘‘తత్’’ స్వరూపులై జీవాత్మను ప్రకృతిని - ‘‘దత్’’ = పరమాత్మకు సమర్పించు బోధ ప్రసాదించువారు.


1వ ఖండము - తారకమ్

ఒకానొక సందర్భములో భక్తజన పరాయణుడగు శ్రీమన్నారాయణుడు లీలా వినోది అయి, సత్యక్షేత్రము (సత్యలోకము, బ్రహ్మలోకము) నకు విజయం చేశారు. నారాయణ భగవానుని రాకను బ్రహ్మానందభరితులైన బ్రహ్మదేవుడు స్వామికి స్తుతి, ఆవాహన, సింహాసన, అర్ఘ్య, పాద్యాదులను సమర్పించి పరమభక్తితో ఆత్మనివేదన నిర్వర్తించారు.

శ్రీమన్నారాయణుడు : కుమారా! సృష్టికర్తా। బ్రహ్మదేవా! బహుకళాత్మకంగా మీచే సృష్టించబడుచున్న విశ్వరచన, అందలి ప్రియస్వరూపులగు జీవులు - సమస్తము క్షేమమే కదా?

బ్రహ్మదేవుడు: తండ్రీ। ఆదినారాయణా। పరబ్రహ్మమూర్తీ! తమరు సర్వజ్ఞులు. మీకు తెలియనిదేమున్నది? మీరు అన్నట్లు - శోభాయమానంగాను, కళాత్మకంగాను మీరు ప్రసాదించిన ‘సృష్టిశక్తి’చే కల్పించుచున్నాను. అయితే, నా కల్పన అగు సృష్టి సామ్రాజ్యములో ప్రవేశించిన జీవులు మీ మాయచే తమ సహజరూపమును ఏమరుచుచున్నారు.

ఇంద్రియములకు ఎదురుగా కనిపిస్తున్న దృశ్యముతో తన్మయులై, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య పాశములను తమకుతామే కల్పించుకొని బద్ధులగుచున్నారు. జన్మ కర్మ చక్రములో తగుల్కొని బహుదుఃఖితులు అగుచున్నారు. ఈ జీవుల జనన-మరణ-గర్భశోకాది సంసార దుఃఖములను చూస్తూ ఉన్నప్పుడు నా హృదయము ద్రవిస్తున్నది. స్వామీ! మేమంతా అట్టి సమస్త దుఃఖములనుండి (From all kinds of worries) తరించి ఆత్మానారాయణ మహాసామ్రాజ్యములోనికి ప్రవేశించగల ఉపాయమేమిటి? మేమంతా తరించగల ‘తారకము’ను ఉపదేశించమని ప్రార్థిస్తున్నాను.

శ్రీమన్నారాయణ భగవానుడు : ప్రియ సృష్టి ప్రజ్ఞానంద స్వరూపా! బ్రహ్మదేవా! సత్యానంద చిదాత్మకం సాత్త్వికం మామకం ధామ ఉపాస్వ - (ఇతి ఆహ)। సమస్త సంసార దుఃఖములకు తరుణోపాయము - సత్య - ఆనంద - చిదాత్మకము, పరమ సాత్త్వికము (సత్ ఆత్మికము) అగు నాయొక్క ధామము (లేక) స్థానము సిద్ధించుకోవటమే - ఉపాయము. ఎవ్వరైతే ‘‘జీవాత్మరూప తృష్ణ - దృశ్య-సంబంధములతో సహా ఇక్కడి సమస్తము కేవలాత్మ స్వరూపుడునగు నాచేతనే దత్తము (ఇవ్వబడటము, ప్రదర్శించబడటము) జరుగుచున్నది’’ - అను అర్థమును కలిగియన్న - ‘‘సదా దత్తోఽహమస్మి’’ అను మంత్రార్థసిద్ధిని పొంది, అనునిత్య, స్వాభావిక ఆత్మభావన కలిగి ఉంటారో, - (A sense that I am the generating and disolving source of what all being externally experienced):-
న తే సంసారిణో భవంతి।- అట్టి ఆత్మతత్త్వ మనన రూప మంత్రోపాసన చేయువారు సంసార బంధము కలిగియుండే ప్రసక్తియే ఉండదు.

ఈ విధంగా ఆత్మానారాయణుడగు శ్రీమన్నారాయణునిచే వివరణగా బోధించబడి, బ్రహ్మదేవుడు ‘‘విశ్వరూపధరుడు, విష్ణువు అయినట్టి శ్రీమన్నారాయణుని శ్రీమత్ దత్తాత్రేయ పరతత్త్వస్వరూపముగా ధ్యానించసాగారు. ఈ విధంగా దత్తాత్మిక-త్రిమూర్త్యంశ రూపమును భావనాత్మకంగా ఉపాసించసాగారు.

దత్తాత్రేయ నామములో
‘‘దమ్’’ - ఇతి ‘‘హంస’’। (జీవుడు / జీవాత్మ) (The Relative Self) (ఒక సందర్భము నాదైన - ‘నేను’).
‘దామ్’ - ఇతి దీర్ఘము। (ఈశ్వరుడు)। (The All pervading self) (సమస్త సందర్భములు నావైన ‘నేను’).
తత్ - బీజము (కేవలమగు ఆత్మ) (The Absolute self) సమస్త సందర్భములకు సంబంధించక, ఆవలగా ప్రకాశించు నేనైన ‘నేను’.
బీజస్థమగు ‘దామ్’ - ఇది ఏకము, అక్షరము అగు పరమాత్మ (The All inclusive / comprehensive self)
(That SELF which is encompassing all else while being also beyond).

‘దత్తాత్రేయము’ అనునది తరింపజేయు ‘తారకము’. అట్టి దత్తాత్రేయతత్త్వమే ఉపాసించవలసినట్టిది. (ఉపాసితవ్యం). తెలుసుకోవలసినట్టిది (జ్ఞేయమ్). ‘జన్మ’ మొదలైన గర్భశోకముల నుండి తరింపజేయునది. (గర్భాది తారణమ్।)

‘దత్తాత్రేయ జపమంత్రమునకు’
ఛందస్సు - గాయత్రీ। దేవత - దత్తాత్రేయుడు

ఒక చిన్న ‘‘మర్రి విత్తనము (వటబీజము)’’లో - ఆ వటమహావృక్షముయొక్క సుదూరముగా భూమిలో విస్తరించు వ్రేళ్లు, అతి పెద్దదగు కాండము, విస్తారమైన కొమ్మ-ఉపకొమ్మలు, ఆకులు, పుష్పములు, మర్రికాయలు, వాటి వాటియొక్క భౌతిక (Physical) మరియు రసాయనిక (Chemical) వస్తు ధర్మములు, పునఃగా చిగురించటము - ఇవన్నీ కూడా - మౌనరూపంగా దాగి ఉంటాయి కదా!

అట్లాగే… ‘దత్త’ బీజములో - (దత్-తత్-జగత్తు. జగత్తులలోని జీవుని రూపము - ఆ రెండిటికి ఆధారమైన ‘తత్’ మొదలైన) విశ్వవిశేషములన్నీ దాగి ఉన్నాయి.

అట్టి అక్షరమై (శాశ్వతమై) దాగి ఉన్న ద్రష్ట - దర్శన - దృశ్యముల మూలము గురించి వ్యాఖ్యానించుకొంటున్నాము.

అట్టి వ్యాఖ్యానము షట్ (6) అక్షరాంశములుగా చెప్పబడుతోంది. (ఒకే అక్షరము ఆరు అక్షర విభాగములుగా వివరించుకుంటున్నాము)

దత్తాత్రేయ షష్టాక్షరీ - బీజ।।

(1) ఓం (2) శ్రీం (3) హ్రాం (4) క్లీం (5) గ్లౌం (6) ద్రాం భగవతే దత్తాత్రేయాయ నమః।

ఈ ఆరు → ‘‘ఏకాక్షర దత్తాత్రేయ - షట్ బీజాక్షరములు’’

ఈ ‘6’ బీజాక్షరములను ‘‘నమో భగవతే దత్తాత్రేయాయ’’ అని ‘చివరగా ’ కలిగి ఉండి జపించువారికి ఈ బీజాక్షరసహిత దత్తాత్రేయ మహామంత్రము భౌతిక - మానసిక - అధ్యాత్మికమైన సర్వ సంపదలను (దైవీగుణములు మొదలైనవాటినన్నిటినీ) సిద్ధింపజేయగలదు. యోగము యొక్క ‘‘అఖండాత్మతో మమేకము’’ అను యుక్తస్థితి ప్రసాదించగలదు.

(1) ఓం - అంగుష్టాభ్యాం నమః।
(1) ఓం - హృదయాయ నమః
(2) శ్రీం - తర్జనీభ్యాం నమః।
(2) శ్రీం - శిరసేస్వాహా।
(3) హ్రాం - మధ్యమాభ్యాం నమః
(3) హ్రాం - శిఖాయ వషట్।
(4) క్లీం - అనామికభ్యాం నమః
(4) క్లీం - కవచాయ హుం।
(5) గ్లౌం - కనిష్ఠికౌభ్యాం నమః
(5) గ్లౌం - నేత్రత్రాయాయ వౌషట్ ।
(6) ద్రాం కరతలకర పృష్ఠాభ్యాం నమః
(6) ద్రాం - అస్త్రాయ ఫట్।

ఫట్ - భూర్భువస్సురాః ఇతి దిగ్భంధం.

దత్తాత్రేయ అష్టాక్షరీ - బీజ।।

ద్రం (లేక) ద్రాం దత్తాత్రేయాయ నమః ‘8’ అక్షరముల మంత్రము.

ద్రమ్ = దారమ్ - ప్రసాదించునది
ద్రామ్ = దారమ్ - ఏకము చేయునది.
దత్తాత్రేయ - ఇతి = సత్య ఆనంద చిదాత్మకము
నమ - ఇతి = జీవన్ బ్రహ్మైక్య / దృశ్య ద్రష్టైక్య ‘పూర్ణాత్మకార్థము’. (‘‘జీవాత్మతో కూడుకొని, నాయొక్క దృశ్యానుభవముతో సహా పరమాత్మ స్వరూపుడనగు పూర్ణాత్మరూపమే’’ - అను అర్థము)

దత్తాత్రేయ ద్వాదశాక్షరీ - బీజ

‘‘గాయత్రీ’’ ఛందః। ‘సదాశివ’ - ఋషిః। ‘‘దత్తాత్రేయో’’ - దేవతా।
‘‘దత్తాత్రేయ’’ - ఇతి కీలకమ్। తదేవ బీజం। నమః శక్తిః।

భజవతి। -

(1) ఓం (2) ఆం (3) హ్రీం (4) క్రోం    
దత్తాత్రేయాయ స్వాహేతి

4 + 8 = 12

ఇది ద్వాదశీ మంత్రరాజము. (12) అక్షరములు కలిగియున్నది.

‘జగతీ’ - ఛదః। ‘సదాశివ’ - ఋషిః। ‘దత్తాత్రేయో’ - దేవతా  
‘ఓం’ ఇతి - బీజం। ‘స్వాహా’ - ఇతి శక్తిః।  
‘‘హ్రీ’’ ‘‘క్లీం’’ - ఇతి శీర్షే। ‘ఏహి’ - ఇతి శిఖాయాం।  
‘దత్త’ - ఇతి కవచే। ‘‘ఆత్రేయ’’ - ఇతి చక్షుసి।  
‘స్వాహా’ ఇతి - అస్త్రే। 

తన్మయో భవతి య ఏవం వేద।

దత్తాత్రేయ షోడశాక్షరీ - బీజ

Ⅰ. మంత్రము

ఓం సం బుద్ధిః ద్రం హ్రీం క్లీం ఏహి
దత్తాత్రేయాయ స్వాహా।।
9 + 7 = 16

ఈ షోడశాక్షరీ మహా మంత్రముయొక్క తత్త్వమును ఎరిగి, మంత్రోచ్ఛారణచే దత్తాత్రేయభగవానుని ఉపాసించువారు తన్మయుడు కాగలడు. (తదేవాహమ్- ఆ దత్తాత్రేయ తత్త్వమే నేను - అను) స్వాభావిక సత్యమును సిద్ధించుకొనగలరు.

శ్రీ దత్తాత్రేయ షోడాశాక్షరీ మంత్ర వ్యాఖ్యానము

భక్తి, శ్రద్ధ, సేవాభావము, గురుశుశ్రూష లేనివానికి ఈ షోడసాక్షరీమంత్రరాజమును ఉపదేశించరాదు. ప్రాణం దేయః। మానం దేయం। చక్షర్దేయం। శ్రోత్రం దేయం। షడ్డంశ శిరశ్ఛినత్తి। షోడషాక్షరమంత్రో న దేయో భవతి। అర్హతలేనివానికి ప్రాణమానములుగాని, కళ్లు గాని చెవులుగాని ఇవ్వవచ్చునేమో। అంతేగాని షట్ దర్శనశిరస్సులను (అరిషట్‌వర్గములను) ఖండించగల షోడశాక్షరీమంత్రము ప్రసాదించరాదు. ఉత్తమసేవాభావన, పరాభక్తి, సద్గుణములు గల శిష్యునికి ఈ షోడశాక్షరీ మహామంత్ర జప రహస్యార్థమును గురువు తప్పక ప్రేమగా ప్రసాదించును గాక। అది గురు-శిష్యులిరువురికి శుభప్రదము కాగలదు.

Ⅱ. షోడాశాక్షరీ

‘‘ఓం’’ - ఇతి ప్రథమం భవతి। ‘‘ఐం’’ ద్వితీయం। ‘‘క్రోం’’ తృతీయం।
‘‘క్లీం’’ ఇతి చతుర్థం। ‘‘క్లూం’’ ఇతి పంచమం। ‘‘హ్రాం’’ ఇతి షష్ఠం।
‘‘హ్రీం’’ ఇతి సప్తమం। ‘‘హ్రూం’’ ఇతి అష్టమం। ‘‘సౌః’’ ఇతి నవమం।
‘‘దత్తాత్రేయ’’ - ఇతి - చతుర్దశ। (14)
‘‘స్వాహా’’ ఇతి షోడశ।। (2) [14 + 2 = 16]
ఓం ఐం క్రోం (3)
క్లీం క్లూం హ్రాం (3)
హ్రీం హ్రూం సౌః (3)
దత్తాత్రేయేతి స్వాహా (7)
(16 అక్షరములు)

Ⅲ. ‘గాయత్రీ’ ఛందః। సదాశివ ఋషిః, దత్తాత్రేయో దేవతా।
‘ఓం’ బీజం। స్వాహా శక్తిః। చతుర్ధ్యంతం కీలకం।

‘ఓం’ ఇతి హృదయే। క్లాం క్లీం క్లూం ఇతి శిఖాయాం।
‘సౌః’ ఇతి కవచే। ‘‘చతుర్థతం చక్షుషి స్వాహా’’ ఇతి అస్త్రే ।।
కరన్యాసము అంగన్యాసము
‘ఓం’ అంగుష్ఠాభ్యాం నమః। ఓం హృదయాయ నమః
‘‘క్లాం’’ తర్జనీభ్యాం నమః। క్లాం శిరసే స్వాహా
‘‘క్లీం’’ మధ్యమాభ్యాం నమః। క్లీం శిఖయా వషట్
‘‘క్లూం’’ అనామికాభ్యాం నమః। క్లూం కవచాయ ‘హుం’
‘‘సౌః’’ కనిష్ఠి కాభ్యాం నమః। సౌః నేత్ర త్రయాయ వౌషట్
‘‘స్వాహా’’ కరతలకరపృష్ఠాభ్యాం నమః స్వాహా అస్త్రాయ ఫట్

భూర్బువస్సువ ‘ఓం’ - (భూః భువః సువః - ఓం) - ఇతి దిగ్బంధః।।

(ఓం) క్లాం క్లీం క్లూం సౌః భగవతే (8)       
శ్రీ దత్తాత్రేయాయ స్వాహా (8)
{8 + 8 = 16}

పై మంత్రములలో ఏదో ఒకటి నిత్యము జపించువాడు ‘సచ్చిదానంద సుఖీ, మోక్షీ’ అగుచున్నాడు.

సౌః ఇత్యంతే ‘శ్రీవైష్ణవ’ ఇతి ఉచ్యతే। తజ్జాపీ విష్ణురూపీ భవతి।

(ఓం) క్లాం క్లీం క్లూం సౌః (5)
శ్రీ వైష్ణ దత్తాత్రేయాయ స్వాహా। (11)     
{5 + 11 = 16}

ఈ మంత్రము జపించువాడు స్వయమ్ విష్ణురూపుడు (Al-present and Al-pervading Self) అగుచున్నాడు.

పై మంత్రములయొక్క పరమార్థమును వ్యాఖ్యానించుకొని, శ్రవణము చేసి అర్థం చేసుకోవటం చేత సర్వత్రా సమదర్శనమును (సమస్తమునందు స్వస్వరూపాత్మను, సమస్తము స్వస్వరూపాత్మయందు) ఇక్కడే, ఇప్పుడే ఈ జీవుడు సిద్ధించుకోగలడు.

హరేకృష్ణ దత్తాత్రేయ మహామంత్రము

దత్తాత్రేయ హరేకృష్ణ ఉన్మత్తానంద దాయక। 16
దిగంబర మునే బాల పిశాచ జ్ఞానసాగరాత్।। 16
16 + 16 = 32

ఈ మంత్రమునకు -
అనుష్ఠుప్ - ఛందస్సు।
సదాశివ - ఋషి।
దత్తాత్రేయో - దేవతా।

మంత్రము కరన్యాసము అంగన్యాసము
‘‘దత్తాత్రేయ’’ -
అంగుష్ఠాభ్యాం నమః। -
ఇతి హృదయే (హృదయాయ నమః)
‘‘హరేకృష్ణ’’ -
తర్జనీభ్యాం నమః। -
ఇతి శీర్షే (శిరసే స్వాహా)
‘‘ఉన్మత్తానంద’’ -
మధ్యమాభ్యాం నమః। -
ఇతి శిఖాయామ్ (శిఖాయ కషట్)
‘‘దాయకమ్’’ -
అనామికాభ్యాం నమః। -
ఇతి కవచే (కవచాయ హుం)
‘‘దిగంబరమ్’’ -
కనిష్ఠికాభ్యాం నమః। -
ఇతి చక్షుపి (నేత్రత్రయాయ వౌషట్)
‘‘పిశాచజ్ఞానసాగర’’ -
అనుష్టుభో-యం -
ఇతి అస్త్రే (అస్త్రాయ ఫట్)

(అనుష్టుప్ ఛందః) - మయా-ధీతః। - ఇతి దిగ్బంధః।।

ఈ హరేకృష్ణ దత్తాత్రేయ మహామంత్రము ఉపాసించువారి యొక్క ఆ బ్రహ్మ-జన్మపర్యంతము (బ్రహ్మ నుండి జన్మ వరకు) దోషములు నివారణము అవగలవు. లోక శ్రేయోభిలాషి కాగలడు (సర్వోపకారీ). సమస్త బంధములు విడివడినవై మోక్ష స్వరూపుడు కాగలడు.

ఇందలి అర్థముయొక్క అధ్యయనము మోక్షమును ప్రసాదించగలదు.

ఇతి ఉపనిషత్ - ‘‘ఇతి ప్రథమః అధ్యాయః’’


2వ ఖండము - స్మరణమాత్ర సంతుష్టాయ

విష్ణుభగవానుడు (శ్రీమన్నారాయణస్వామీ!)

‘ఓం’ అని ఎలుగెత్తి పలికెదరు గాక। వ్యాహృతము నిర్వర్తించెదరుగాక। (ఓం ఇతి వ్యాహరత్)

‘‘నమో భగవతే దత్తాత్రేయాయ’’

ఓం నమో భగవతే శ్రీదత్తత్రేయాయ। స్మరణ మాత్ర సంతుష్టాయ। మహాభయనివారణాయ। మహాజ్ఞానప్రదాయ। చిదానందాత్మనే। బాలోన్మత్తపిశాచ వేషాయేతి। మహాయోగినే అవధూతాయేతి। అనసూయానంద వర్థనాయ। అత్రిపుత్రాయేతి। సర్వకామ ఫలప్రదాయ।।

శ్రీ దత్తాత్రేయ స్వామి → ‘స్మరణ’ మాత్రముచేతనే సంతోషించువారు. సంసార మహాభయమునకు నివారణోపాయము. చిదానంద స్వరూపులు. బాల - ఉన్మత్త పిశాచవేషములు ధరించువారు. మహాయోగి వరేణ్యులు. ‘అవధూత’ అయినట్టి వారు. మాతృదేవత అగు అనసూయాదేవికి ఆనందము కలిగించువారు - అత్రి మహర్షి కుమారులు. సమస్త కోరికలను భక్తులకు నెరవేర్చువారు.

బీజాక్షర ఫలశ్రుతి

‘‘ఓం’’ కారముతో కలిపి(పై) ‘‘దత్తాత్రేయ’’ అభివర్ణనము (మంత్రము పలుకుట) వలన (వ్యాహరన్) బంధములన్నీ తొలగగలవు.

✡︎ ‘‘ఓం’’ అను వ్యాహరణము (పలుకు)చే భవబంధమోచనము కాగలదు. (‘ఓం’ - ఇతి వ్యాహరేత్ భవబంధ మోచనా యేతి)।
✡︎ ‘హ్రీం’ - అను వ్యాహరణముచే సకల విభూతులు - ప్రసాదించబడగలవు. (హ్రీం - ఇతి వ్యాహరేత్ సకల విభూతి దాయేతి।)
✡︎ ‘క్రోం’ - అను వ్యాహరణము (పలుకుట)చే సాధ్యాకర్షణము లభించగలదు. (‘క్రోం’ - ఇతి వ్యాహరేత్ సాధ్యాకర్షణాయేతి)। అందరికీ ఆకర్షితుడై ఉండగలడు. (Respected and liked by all).
✡︎ ‘సౌః’ అను వ్యాహారణములచే అనేక విధములుగా బాహ్యంగా ప్రసరించు మనస్సును నిరోధించగలరు. (సౌః ఇతి వ్యాహరేత్ సర్వమనః క్షోభయేత్). మనస్సును మధించి, చంచలత్వమును వదిలించి, అద్దానిని ఆత్మయందు స్థాపించగలరు.
✡︎ ‘‘శ్రీం’’ - అను వ్యాహరణము (శబ్దము పలుకుట)చే మహత్తరమగు ‘ఓంకారము’ అని పలుకుట అగుచున్నది. (‘శ్రీం’ ఇతి వ్యాహరేత్ మహా ‘ఓం’ ఇతి వ్యాహరేత్)। జీవునియొక్క శాశ్వతత్త్వము పలకటము అగుచున్నది (చిరంజీవినే)।
✡︎ ‘‘వషట్’’ అని పలకటము - ‘‘ఆత్మయొక్క పరమార్థమును మాకు వశము చేయుమని ప్రార్థన’’ (వషట్ - ఇతి వ్యాహరేత్ వశీకురు। వశీకురు।)
✡︎ ‘‘వౌషట్’’ - అని పలకటముచే ‘‘ఆత్మతత్త్వము నన్ను ఆకర్షించునుగాక। నాకు అన్నిటికంటే ఆకర్షితము (ఇష్టము) అగుగాక।’’ అని అనటము (‘వౌషట్’ - ఇతి వ్యాహరేత్ ఆకర్షయ। ఆకర్షయ।)
✡︎ ‘హుమ్’ అనే పలుకుటచే అసూరీసంపత్తి (అహంకారం, దర్పము, క్రోధము, పారుష్యము, అజ్ఞానము మొదలైనవి) తొలగగలవు. (విద్వేషత్వము పొందగలవు). (హుం-ఇతి) వ్యాహరేత్ విద్వేషయ। విద్వేషయ।)
✡︎ ‘‘ఫట్’’ - అను పలుకుటచే (ఆసురీగుణములను, బద్ధకము - అశ్రద్ధవంటి) తమో లక్షణములు మొదలంట్ల పెకలించివేయబడగలవు. (ఫట్ ఇతి వ్యాహరేత్ ఉచ్చాటయ। ఉచ్చాటయ)
✡︎ ‘‘ఠఠ’’ - అను వ్యాహరము (పలుకుట)చే మనోబుద్ధి, చిత్తములయొక్క చాంచల్యమును స్తంభింపజేయటము జరుగగలదు. (ఠఠేతి వ్యాహరేత్ స్తంభయ। స్తంభయ)
✡︎ ‘‘ఖఖ’’ - అని పలుకుటచే అజ్ఞాన తమస్సు (Ignorance) - మర్దింపబడగలదు (ఖఖేతి వ్యాహరేత్ మారయ। మారయ)।


ఓం భగవతే దత్తాత్రేయా। ఈ ‘విశ్వము’ అనబడే సమస్తము తమ సంపదయే। సమస్సంపన్నాయ। సమస్సంపన్నాయ స్వాహా! సమస్తము పరిపోషిస్తూ ఉన్నది మీరే! పోషయ। పోషయ।

స్వామీ! నన్ను సంసార (దృశ్యముతో కామక్రోధ పూర్వక) సంబంధ కల్పింత బంధములను, (ఆత్మభావనకు వ్యతిరిక్తమగు) అన్యరూప (పర) మంత్ర - యంత్ర - తంత్రములను ఖండించి వేయండి. (పరమంత్ర - పరయంత్ర- పరతంత్రాం ఛిందయ। ఛిందయ।). దుష్ట గ్రహపీడనములను మాపట్ల నివారింపజేయండి (గ్రహాన్ నివారయ। నివారయ।).

మానసిక, శారీరక ఆధి వ్యాధులు మమ్ములను బాధించకుండా ఉపశమింపజేయండి. (వ్యాధిం నివారయ। నివారయ।). మా దుఃఖములను హరించివేయండి. (దుఃఖం హరయ। హరయ।) స్వామీ! దారిద్ర్యము పారిపోయేటట్లు (నిద్రావణము) చేసివేయండి. (దారిద్ర్యం నిద్రావయా। నిద్రావయ) మా దేహమును తమరు పరిపోషించి రక్షించెదరు గాక। మా చిత్తము పరిశుభ్రమై ఆనందయుక్తమై ఉండునట్లుగా తీర్చిదిద్దండి. దేహం పోషయ। పోషయ। చిత్తం తోషయ। తోషయ।

సర్వ మంత్ర, సర్వ యంత్ర, సర్వ తంత్ర, సర్వ పల్లవ (చిగురుల) ‘స్వరూపుడగు పరమశివునకు నమస్కారము.

ఓం నమః శివాయ। ఓం నమః శివాయ। ఓం నమః శివాయ

ఇతి ఉపనిషత్ - ‘‘ఇతి ద్వితీయ అధ్యాయః’’


3వ ఖండము - అష్టమూర్తి - ఫలశ్రుతి

అష్టాక్షరీమంత్రము

ఓం। ద్రాం దత్తాత్రేయాయ స్వాహా
         1     5                    2        = (8)
ఓం। ద్రం దత్తాత్రేయాయ స్వాహా।
         1     5                    2        = (8)

అనుష్టుప్ - ఛందస్సు.
సదాశివ - ఋషి।
‘దత్తాత్రేయో’ - దేవతా।

ఓం - ఇతి బీజమ్। స్వాహా - ఇతి శక్తిః।। ద్రాం ఇతి కీలకం।

ఈ అష్టాక్షర మంత్రము అష్టమూర్తులతో కూడిన ‘అష్టమంత్రము’ అగుచున్నది.

ఈ మంత్రమును అర్థపూర్వకంగా ఉపాసించటముచే - సమస్త బంధములు ముడివీడినవై, - అవన్నీ - ఆత్మ మాధుర్యమును సంతరించుకోగలవు.
(విష్ణు భగవానుడు తనకు తానే అత్రి మహర్షికి సమర్పించుకున్న - విష్ణుతత్త్వ - దత్తాత్రేయము)

ఎవ్వరైతే పైనచెప్పబడిన అష్టమూర్తీ సంజ్ఞా మంత్రమును అష్టాక్షరరూపంగా నిత్యము ఉపాసిస్తూ ఉంటారో - అట్టివారు వాయువు, అగ్ని, చంద్రుడు (సోమ), సూర్యుడు, ఆదిత్యుడు, బ్రహ్మ విష్ణువు, రుద్రులవలె (దోషములన్నీ తొలగగా) ‘సోఽహమ్’ భావనను స్వాభావికరూపంగా సిద్ధించుకోగలరు.

దత్తాత్రేయ అష్టాక్షరమహామంత్రము (మరియు) తదితరములైన (ఈ దత్తాత్రేయోపనిషత్‌లోని) దశాక్షర (10), ద్వాదశాక్షర (12), చతుర్దశాక్షర (14), షోడశాక్షర (16) మొదలైన బీజాక్షరములతో కూడిన - మంత్రములు జపించుటచే శతసహస్ర (లక్ష) గాయత్రీ ఉపాసనలతో సమానఫలము పొందగలరు. అది శతమహారుద్రజపము చేసిన ఫలముతో సమానము అవగలదు. ప్రణవమును కోటి జపము చేసిన ఫలముతో సమానము కాగలదు.

ఈ దత్తాత్రేయోపనిషత్‌లోని విశేషములను శ్రవణ- మనన- ఉపాసనలు చేయువారు ఎక్కడ ఉంటే అక్కడ - వెనుకగల వందమంది, ముందు గల వందమంది పునీతులు కాగలరు.

వారు ఉన్న పంక్తిలోని వారందరు పావనులు కాగలరు.

గోహత్య, బ్రహ్మహత్య వంటి పాపములు చేసినవారు కూడా ఈ ఉపనిషత్తులో చెప్పబడిన బీజాక్షర - దత్తమంత్ర ఉపాసనచే అట్టి దోషములనుండి విముక్తులు కాగలరు. తులాభార వ్రతము సమర్పణ చేసినవారితో సమానమైన పవిత్రత సంతరించుకోగలరు.

తినకూడనివి తినిన దోషముల నుండి నిర్మలులు కాగలరు. సూర్య మంత్ర - యోగ పారీణులు (నిర్వర్తించినవారు) కాగలరు. బ్రహ్మమును ఎరిగి బ్రహ్మమే తామై ప్రకాశించగలరు. (బ్రాహ్మణుడు కాగలడు).

భక్తుడైన శిష్యునికి బోధించటంచేత గురు-శిష్యులు ఇరువురు అనంత ఫలము పొందగలరు. జీవన్ముక్తులు కాగలరు.


ఈ విధంగా భగవానుడగు శ్రీమన్నారాయణుడు బ్రహ్మదేవునికి శ్రీ దత్తాత్రేయతత్త్వమును బోధించారు. విశదపరచారు.

🙏 ఇతి దత్తాత్రేయ ఉపనిషత్ ।।
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।