[[@YHRK]] [[@Spiritual]]

Sāvitri Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 4
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com


సామవేదాంతర్గత

15     సావిత్ర్యుపనిషత్

‘‘గాయత్రీ బల-అతి బల’’ - ఉపాసన

శ్లోక తాత్పర్య పుష్పమ్



ఓం।
సావిత్ర్యుపనిషత్ వేద్య, ‘చిత్’ సావిత్ర పదోజ్జ్వలమ్
ప్రతియోగి వినిర్ముక్తం రామచంద్రపదం భజే।
‘‘కేవల చిత్’’ అను ‘స్రావిత్ర్యు పదము’ను ప్రజ్వలము చేయుచు, ‘‘సావిత్ర్యుపనిషత్’’ చెప్పు మహత్తరార్థమును హృదయస్తము చేసుకొనగలుగుటకై శ్రీరామచంద్ర స్వామి పాదపద్మములను ఆశ్రయిస్తున్నాము.


మం।। శ్లో।। ఓం భూర్భువస్సువః తత్సవితుః వరేణ్యం భర్గోదేవస్య ధీమహి
ధియో యోనః ప్రచోదయాత్।।
తత్ ‘ఓం’కారార్థ భర్గో దేవుడు భూ-భువర్-సువర్ త్రిలోకములను తన సత్-విత్‌లచే వెలిగించుచున్నారు. వారి మహిమను స్థుతిస్తున్నాము. మా బుద్ధిని ప్రేరేపించెదరు గాక!
శ్లో।।
ఓం సావిత్రీ, ఆత్మా, పాశుపతం, పరంబ్రహ్మ, అవధూతకమ్,
త్రిపురాతాపనం, దేవి, త్రిపురాకర భావనా।।
పరబ్రహ్మతత్త్వమును ఎలుగెత్తి గానం చేస్తూ మమ్ములను క్రమంగా ఆత్మానుభూతియందు చేర్చగల నవోపనిషత్ ఉద్యాన వనదేవతలగు (1) సావిత్ర్యుపనిషత్ (సామవేద) (2) ఆత్మోపనిషత్ (అథర్వణవేద) (3) పాశుపత బ్రహ్మోపనిషత్ (అథర్వణ వేద) (4) పరంబ్రహ్మోపనిషత్ (అథర్వణవేద) (5) అవధూతోపనిషత్ (కృష్ణయజుర్వేద) (6) త్రిపురాతాపిన్యుపనిషత్ (ఋగ్వేద) (9) భావనోపనిషత్ (అథర్వణవేద) - నవోపనిషత్ పాఠ్యాంశ ప్రవచనములకు నమస్కరించుచున్నాము. వాటిసారమగు మిధునత్వము (పరస్పరత్వము/పరస్పర సంయోగత్వము) గురించి సమీక్షగా చెప్పుకుంటున్నాము.
(యోని స్థానము = జనన స్థానము)

మంగళశ్లోకములు

తాత్పర్యము

ఓం।
1. కః సవితా?
కా సావిత్రీ?
‘సవితా’ ఎవరు? సావిత్రి ఎవరు?

(సవిత - పురుషుడు (పుం)
సావిత్రి - పురుషకారము (స్తీ)
సత్-విత్-రతి- ఇతి ‘‘స్త్రీ’’। )
అగ్నిరేవ సవితా! పృథివీ సావిత్రీ।
అగ్నియే సవిత। పృథివి సావిత్రి।
స యత్ర అగ్నిః తత్ పృథివీ।
యత్ర వా పృథివీ, తత్ర అగ్నిః।
తే ద్వే యోనిః। తత్ ఏకం మిథునమ్।।
ఎక్కడ అగ్ని ఉంటే-అక్కడ పృథివి ఉంటుంది. ఎక్కడ పృథివి ఉంటుందో అక్కడ అగ్ని కూడా ఉండియే తీరుతుంది. పరస్పరము ఒకటికి మరొకటి యోనిస్థానంగా కలిగి ఉన్నాయి.

ఉభయము యోనియే। పరస్పరము జనన స్థానమే। ఏకము (ఐక్యత - ఒకటిగా అయిఉన్న) - మిథునము (కలయిక). (రెండుగా కనిపిస్తూ, ఒక్కటే అయి ఉన్నట్టివి.)
2. కః సవితా? కా సావిత్రీ?
వరుణ ఏవ సవితా। ఆపః సావిత్రీ।
స యత్ర వరుణః తత్ ఆపో।
యత్ర వా ఆపః, తత్ వరుణః।
తే ద్వే యోనిః। తదేకం మిథునమ్।।
సవిత ఎవరు? సావిత్రి ఎవరు?
వరుణుడే సవిత. జలము సావిత్రి. ఎక్కడ వరుణుడు ఉంటే - అక్కడ జలము. ఎక్కడ జలము ఉంటే అక్కడ వరుణుడు కూడా ఉంటారు. పరస్పరము యోనిస్థానములు(placed in) గా కలిగి ఉన్నాయి. అవి రెండుగా యోని. అయితే అవి రెండూ వస్తుతః మిధునము. ఏకము. ఒక్కటే. (మిథునము = బంగారము + ఆభరణముల ఏకత్వమువంటిది).
3. కః సవితా? కా సావిత్రీ?
వాయురేవ సవితా। ఆకాశః సావిత్రీ।
యత్ర స వాయుః తత్ ఆకాశో।
యత్ర వా ఆకాశః, తత్ వాయుః।
తే ద్వే యోనిః। తదేకం మిథునమ్।।
గాలియే (వాయువే) సవిత. ఆకాశము సావిత్రి. వాయువు ఎక్కడ ఉంటే అక్కడ ఆకాశము, ఎక్కడ ఆకాశము ఉంటే అక్కడ వాయువు ఉంటాయి.
వాయువుకు ఆకాశము స్థానము. వాయువులో ఆకాశము ఉండటంచేత వాయువునందు ఆకాశమునకు స్థానము.
రెండు పరస్పరం యోని. ఒకదానికి మరొకటి జననస్థానము. వాటి ఏకత్వము మిథునము. సంయోగ ఏకత్వమే ‘సత్యము’. (మిథునము = జలము + తరంగముల ఏకత్వమువంటిది).
4. కః సవితా? కా సావిత్రీ?
యజ్ఞ ఏవ సవితా। ఛన్దాంసి సావిత్రీ।
యత్ర యజ్ఞః తత్ ఛన్దాంసి।
యత్ర వా ఛన్దాంసి స యజ్ఞః।
తే ద్వే యోనిః। తదేకం మిథునమ్।।
యజ్ఞము సవిత. ఛందస్సులు (వేదములు) సావిత్రి.
ఏది యజ్ఞమో, అది ఛందస్సే (వేదమే).
ఏది ఛందస్సులో (వేదములో) అది యజ్ఞమే. పరస్పరము యోని స్థానముగా (పుట్టినచోటుగా) ఉంటున్నాయి. ఈ రెండు యోని ద్వయం. ఆ రెండిటి ఏకత్వమే మిథునము. (భావికుడు-భావనల ఏకత్వము వంటిది).
5. కః సవితా? కా సావిత్రీ?
స్తనయిత్నురేవ సవితా। విద్యుత్ సావిత్రీ।
స యత్ర స్తనయత్నుః తత్ విద్యుత్।
యత్ర వా విద్యుత్ తత్ స్తనయత్ను।
తే ద్వే యోనిః తదేకం మిథునమ్।।
(మబ్బు / ఉరుము) - సవిత
విద్యుత్తు (మెరుపు) - సావిత్రీ
ఎక్కడ మబ్బుయో అక్కడ మెఱుపు. ఎక్కడ మెఱుపో - అక్కడ మబ్బు.
మేఘ - మెఱుపుల ఒక దానికి మరొకటి యోని. (Zone of Birth) రెండు ఏక స్థానమును కలిగి, ఏకమే అయి ఉన్నాయి. (మిథునము = వ్యక్తి + వ్యక్తీకరణముల ఏకత్వము వంటిది).
6. కః సవితా? కా సావిత్రీ?
ఆదిత్య ఏవ సవితా। ద్యౌ సావిత్రీ।
స యత్ర ఆదిత్యః తత్ ద్యౌః।
యత్ర వా ద్యౌః, తత్ ఆదిత్యః।
తే ద్వే యోనిః తదేకం మిథునమ్।।
ఆదిత్యుడు సవిత. తేజస్సు సావిత్రి. ఎక్కడ ఆదిత్యుడుంటే అక్కడ తేజస్సు ఉంటుంది. ఎక్కడ తేజస్సు ఉంటే అక్కడ ఆదిత్యుని ఉనికి ఉన్నది.
ఆదిత్యుడు తేజోరూపుడు. తేజోలోకము ఆయనయొక్క జననస్థానము. తేజస్సుకు ఆదిత్యుడు జననస్థానం. ఆ ఇరువురు మిథునము (కలయిక)చే ఏకమే! పరస్పరము (ఒకటికి రెండవది) జనన స్థానము (Place of origin).
(మిథునము = గుణి + గుణముల ఏకత్వమువంటిది).
7. కః సవితా। కా సావిత్రీ।
చంద్ర ఏవ సవితా। నక్షత్రాణి సావిత్రీ।
స యత్ర చంద్రః, తత్ నక్షత్రాణీ।
యత్ర వా నక్షత్రాణి, స చన్ద్రమాః।
తే ద్వే యోనిః। తత్ ఏకం మిథునమ్।।
చంద్రుడు సవిత. నక్షత్ర మండలము సావిత్రి.
ఎక్కడ చంద్రబింబమో - అక్కడ నక్షత్రములు. ఎక్కడ నక్షత్రములో అక్కడ చంద్రబింబము ఉంటాయి.
అవి ఒకదానికొకటి ఉత్పత్తి స్థానము (ఉనికి స్థానము). ఆ రెండు పరస్పరము సంయోగముచే ఏకమే. అట్టి ఏకత్వమే - సత్యము.
(మిథునము = ఆలోచించువాడు + ఆలోచనల ఏకత్వమువంటిది).
8. కః సవితా? కా సావిత్రీ?
‘మన’ ఏవ సవితా। ‘వాక్’ సావిత్రీ।
స యత్ర మనః తత్ వాక్।
యత్ర వా వాక్ తత్ మనః।
తే ద్వే యోనిః। తత్ ఏకం మిథునమ్।।
మనస్సే సవిత. వాక్కు సావిత్రి.
- మనస్సు ఎక్కడున్నదో, అది వాక్ స్థానమే.
- ఎక్కడ వాక్కు ఏర్పడుచున్నదో, అది మనోస్థానమే.
మనోవాక్కులు పరస్పరము యోని (జనన) స్థానములుగా కలిగి ఉన్నాయి. అవి ఏకస్వరూపమగు జంటయే. (మిథునము = జీవి + జీవితముల ఏకత్వమువంటిది).
9. కః సవితా? కా సావిత్రీ?
పురుష ఏవ సవితా। స్త్రీ సావిత్రీ।
స యత్ర పురుషః, తత్ స్త్రీ।
యత్ర వా స్త్రీ, స పురుషః।
తే ద్వే యోనిః। తత్ ఏకం మిథునమ్।।
పురుషుడు సవిత - స్త్రీయే సావిత్రి.
ఎక్కడ పురుషుడు ఉన్నాడో, అది స్త్రీ స్థానమే.
స్త్రీ ఎక్కడో - అది పురుష స్థానమే.
స్త్రీ-పరపురుషులు పరస్పరము జననస్థానములుగా కలిగియున్నారు. అట్టి స్త్రీ పురుషుల జంట ఏకస్వరూపులే. (స్త్రీ లేనిదే పురుషుడు జనించలేడు. పురుషుడు లేకుంటే స్త్రీ జన్మనీయలేదు).
10. తస్యా ఏవ ప్రథమః పాదో ‘భూః’।
‘‘తత్ సవితుః వరేణ్యం’’ -
ఇతి అగ్నిర్వై వరేణ్యమ్।
ఆపో వరేణ్యమ్।
చంద్రమా వరేణ్యమ్।
తస్య (పరమాత్మయొక్క సవితుః యొక్క) ప్రథమ(1) పాదము.
‘‘ భూః తత్సవితుర్వరేణ్యమ్’’. అగ్ని - జల - చంద్రమసములు-‘తత్’ స్వరూపుడగు సవిత్రుదేవతయొక్క భూతత్త్వము (Zone of Matter)
- ‘తత్-పరమాత్మయే’ అగ్ని-జల-చంద్రులుగా పూజింపదగినవారు. అగ్నియే - వరేణ్యము (స్తుతించబడుతోంది. సవిత్రుడే ఆపో (జలము)గా-వరేణ్యము (స్తుతించబడుతోంది)-(అగ్ని = ఉష్ణము).
చంద్రమసము - వరేణ్యము. - (చంద్రమసము = శీతాకాలము) వరేణ్యము.
తస్యా ఏవ ద్వితీయః పాదో।
భర్గమయో ‘‘భువో’’।
‘భర్గో దేవస్య ధీమహి’
ఇతి అగ్నిర్వై భర్గ।
ఆదిత్యో వై భర్గః
చంద్రమా వై భర్గః।
తస్యా ఏష తృతీయః పాదః - ‘స్వః’।
‘‘ధియో యో నః ప్రచోదయాత్।’’
ఇతి స్త్రీ చ, ఏవ పురుషశ్చ, ప్రజనయతో।
యో వా ఏతాం సావిత్రీమ్ - ఏవం వేద,
న పునః మృత్యుం (పునర్ముత్యుం) జయతి।।
తత్ పరమాత్మ యొక్క ద్వితీయపాదము(2) భర్గమయమైనట్టి - ‘‘భువో’’ (Zone of thought and Experiencing)
→ భర్గో దేవస్య ధీమహి’’
అగ్ని - భర్గుడు (తేజోరూపుడు)
ఆదిత్యుడు - భర్గుడు
చంద్రుడు - భర్గుడు
తత్-పరమాత్మయొక్క తృతీయ (3) పాదము - ‘‘స్వః’’। ( నేను -The Sense of ‘I’)
→ ‘‘స్వః ధియో యోనః ప్రచోదయాత్’’
అదియే పురుషుడు. అదియే స్త్రీ
ఆ రెండిటి సంయోగమే సావిత్రి
స్త్రీ - పురుష, ప్రకృతి-పురుష, దృశ్య - ద్రష్టల సంయోగ ఏకత్వమే ‘సావిత్రీ’ తత్త్వ తాత్పర్యార్థము.
ఎవరు ప్రకృతి - పురుషుల, జీవ - ఈశ్వరుల సంయోగ ఏకత్వమును (బంగారము-ఆభరణముల, జలము-తరంగముల అన్యోన్యత్వము, అనన్యత్వముల వలె) ఎరుగుచున్నారో - అట్టివారు మృత్యుపరిధులను అధిగమించి అమృత స్వరూపులగుచున్నారు. (అదియే సావిత్రీతత్త్వము)
11. ‘‘బల-అతిబలయోః’’ (బలాతిబలయోః)
విరాట్ పురుష ఋషిః।
గాయత్రీ దేవతా।
గాయత్రీ ఛందః।
‘అ’ కార ‘ఉ’ కార ‘మ’ కార బీజాద్యాః।
‘క్షుధ’ ఆది నిరసనే వినియోగః।
‘‘బల - అతిబల’’ (యోని=మిథున తత్త్వ స్థానమునకు)
ఋషి → ‘‘విరాట్ పురుషుడు’’
దేవత → ‘‘గాయత్రీ’’
ఛందస్సు → ‘‘గాయత్రీ’’
బీజాది - ‘అ’కార ‘ఉ’కార ‘మ’కారములు.
క్షుద (ఆకలి దప్పిక) మొదలైన వాటి నిరసనయే వినియోగము. ఉద్దేశ్యము ఉపాసన (క్షుత్-పిపాసనలను జయించుటకై) షట్ అంగన్యాసము - షట్ కరన్యాసము.
‘‘క్లాం’’ ఇత్యాది షడంగన్యాసః ‘‘క్లాం’’ మొదలుకొని షడంగన్యాసము.
{ ‘‘క్లాం’’ ‘‘క్లీం’’ ‘‘క్లూం’’ ‘‘క్లైం’’ ‘‘క్లౌం’’ ‘‘క్లః’’ ఈ ఆరు అక్షరములతో
కరన్యాసము → అంగుష్ఠాభ్యానమః ఇత్యాది
అంగన్యాసము → హృదయాయనమః ఇత్యాది }.
12. ధ్యానమ్
అమృతకరతలార్ద్రౌ
సర్వసంజీవనాఢ్యాః,
అఘహరణ సుదక్షౌ
వేదసారే మయూఖే,
ప్రణవమయ వికారౌ
భాస్కరాకార దేహౌ,
సతతమ్ అనుభవేఽహం
తౌ బల - అతిబలేశౌ।। (బలాతీబలేశౌ।)
ధ్యానము
- అమృతము వంటి ఆర్ధ్రములైన కరతలములు (అఱ చేతులు) కలిగియున్నట్టిది, - జీవులను మృత్యువునుండి దాటించి ‘సంజీవనము’ చేయునట్టిది,
- జీవుల పాపములను హరింపజేయు దక్షత, సామర్థ్యము కలిగి ఉన్నట్టిది,
- వేదసార కిరణములను ప్రసరింపజేయునది
- ‘అ-ఉమ’ సమన్విత ప్రణవమయమైన నిరాకార-మహాకారమైనట్టిది, సూర్యదేహముతో ప్రజ్వరిల్లుచున్నట్టిది,
అగు బల-అతిబల ఈశ్వరి ఎల్లప్పుడు నాకు అభయమై ఉండును గాక.
13. ‘‘ఓం హ్రీం’’ బలే। మహాదేవి।
‘‘హ్రీం’’ మహాబలే।
‘‘క్లీం’’ చతుర్విధ పురుషార్థ సిద్ధిప్రదే।
‘తత్సవితుః’ వరదాత్మికే।
‘‘హ్రీం’’ వరేణ్యమ్।
‘‘భర్గో దేవస్య’’ వరదాత్మికే।
‘ఓ హ్రీం బలే। మహాదేవి।-హ్రీం బలస్వరూపిణియగు సావిత్రీ-మహాదేవీ।
‘హ్రీం’ మహాబలే। - ఓం మహాబల స్వరూపిణీ।
‘క్లీం’ చతుర్విథ పురుషార్థ సిద్ధి ప్రదే। - ధర్మ-అర్థ-కామ-మోక్ష పురుషార్థములను సిద్ధించుమాతా।
‘తత్సవితుః’ వరదాత్మికే। - తత్-సత్-విత్-ఆత్మభావన ప్రసాదించు దేవీ।
‘హ్రీం’ వరేణ్యమ్। - హ్రీం - పూజనీయమగుదానా।
‘భర్గోదేవస్య’వరదాత్మికే।- తేజో రూపిణివై సమస్తము ప్రసాదించుదానా।
‘‘అతి బలే - సర్వదయామూర్తే।
బలే సర్వ క్షుద్ర భ్రమా - ఉపనాశిని।
‘‘ధీమహి, ధియో యో నః’’
జాతే ప్రచుర్యా
ప్రచోదయాత్మికే।
ప్రణవశిరసాత్మికే
హుం ఫట్ స్వాహా।
అతిబలే। సర్వదయామూర్తే। -బలమునకే బలమువైయున్న దయామూర్తీ।
క్షుద్రమగు సమస్త భ్రమలను నశింపజేసి, బలమును ప్రసాదించు దేవదేవీ! - ఆకలి-దప్పిక-జగత్‌భ్రమలను ఉపశమింపజేయు తల్లీ।
ధీమహి।। థియో యోనః నీ మహిమను ధ్యానించుచున్నాము.
జాతే ప్రచుర్యా మా బుద్ధికి యోనిస్వరూపిణీ!
ప్రచోదయాత్మికే। ప్రచోదనము ఉత్సాహము ప్రసాదించు దేవీ!
ప్రణవశిరసాత్మికే ‘ప్రణవము’ (ఓం) అను వేదశిరస్సు అయిఉన్నమాతా!
హుం ఫట్ స్వాహా।। ‘హుం-ఫట్’ బీజాక్షరములతో హవిస్సులను సమర్పిస్తున్నాము.
ఏవం విద్వాన్ -
కృతకృత్యో భవతి।।
సావిత్ర్యా ఏవ సలోకతాం జయతి।।
ఈ విధంగా బల అతిబలదేవీతత్త్వమును ఎరిగినవాడు కృతకృత్యుడగు చున్నాడు.
సావిత్రీదేవీ సాలోక్యమును పొందుచున్నాడు.
సత్ - విత్ ఆత్మభగవానునితో మమేకము పొందుచున్నాడు.

ఇతి సావిత్ర్యుపనిషత్
ఓం శాంతిః శాంతిః శాంతిః




సామవేదాంతర్గత

15     సావిత్రి ఉపనిషత్

‘‘గాయత్రీ బల-అతి బల’’ - ఉపాసన

అధ్యయన పుష్పము


ఓం సావిత్ర్యై నమః। గాయత్ర్యై నమః। సరస్వత్యై నమః।


ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యమ్
భర్గో దేవస్య ధీమహి థియో యోనః ప్రచోదయాత్।।
ఏ ‘ఓం’ కార పరమార్థమగు పరమాత్మ పూజనీయమగు తనయొక్క సత్ (ఉనికి) విత్ (ఎరుక), ఋత్ (సవితృ)లచే భూ (Matter) భువ (Thought) సువః (Thinker-Self) లను వెలిగించుచున్నారో, అట్టి తేజోరూపులగు భర్గో దేవుని ధీ-మహిమను స్తుతించుచున్నాను. మా బుద్ధిని ప్రచోదనము చేసెదరు గాక!

ఓం భూర్భువస్సువః

ఓం ప్రణవ దేవతా నమో నమః
భూః తత్సవితుర్వరేణ్యమ్।
భువోః -భర్గోదేవస్య ధీమహి
స్వః -ధియో యోనః ప్రచోదయాత్

చిత్-సత్-ఋత్-వతీ। :: చిత్-సావిత్రీ = సావిత్రీ దేవ్యై నమో నమః। ‘‘చిదేవ సత్। సదేవ చిత్।’’


శ్లో।। సావిత్ర్యాత్మా పాశుపతం పరబ్రహ్మావధూతకమ్
త్రిపురాతపనం దేవి త్రిపురాకర భావనా।।
సావిత్ర్యుపనిషత్ ; ఆత్మోపనిషత్, పాశుపత బ్రహ్మోపనిషత్, పరబ్రహ్మోపనిషత్, అవధూతోపనిషత్; త్రిపురాతాపిన్యూపనిషత్, దేవీ ఉపనిషత్, భావనోపనిషత్‌లకు బ్రహ్మజ్ఞానమున కొరకై నవోపనిషత్ ఉద్యానవన దేవతలుగా ఉపాసిస్తున్నాము. నమస్కరిస్తున్నాము.

( సవితుః = కేవలుడగు సత్ - విత్ పరమపురుషుడు - ‘‘సత్-విత్’’)

(సావిత్రీ = ప్రకృతి సమేతుడైన పరమపురుషుడు)

(సవిత్రు - సావిత్రీ మిథునము)
సవితుః + సావిత్రీ = బంగారము + ఆభరణము,
జలము + తరంగము, భావికుడు + భావన, వ్యక్తి + వ్యక్తీకరణము, జీవి + జీవితము, గుణి + గుణములు, పరమాత్మ + జీవాత్మల మిథునము (పరస్పర అన్యోన్య అనన్యత్వములు)

సవిత ఎవరు? సావిత్రీ ఎవరు?

{ సత్ + విత్-ఇతి-సవితః। తత్ సవిత యదా అనుభవ సమేతం - ఇతి సావిత్రీ।। }

అగ్నిరేవ సవితా। పృథివీ సావిత్రీ : అగ్ని సవిత అయితే, పృథివి సావిత్రీ. అగ్ని ఎక్కడ ఉన్నదో - అక్కడ పృథివి కూడా ఉంటోంది. ఎక్కడ పృథివి ఉన్నదో - అక్కడ అగ్ని ఉంటుంది. ఈ రెండు పరస్పర కారణమైయున్న జంట. కనుక ఏకస్వరూపమే. పరస్పర మిథునము. ళిసంయోగము, సంభోగము, పరస్పరము యోని (జనన స్థానము) కూడారి. పరస్పరము అవిభాద్యమగు అనన్యత్వము కలిగి ఉంటున్నాయి.

వరుణయేవ సవితా। ఆపః సావిత్రీ। స యత్ర వరుణః, తదా ఆపో।
యత్రవా ఆపః తత్ వరుణః। తే ద్వే యోనిః తదేకం మిథునమ్।।

ఎక్కడ వరుణదేవుడుంటే అక్కడ జలముంటుంది. ఎక్కడ జలముంటే అక్కడ వరుణుడు ఉంటారు. వారు ఇరువురు ఒకరికొకరు యోని (జనన) స్థానము. ఏక జంట స్వరూపులు. పరస్పర కార్య-కారణులు. పరస్పరము అభిన్నస్వరూపులు.ఆ మిథునము బంగారము - ఆభరణముల ఏకత్వము వంటిది.

వాయురేవ సవితా। ఆకాశః సావిత్రీ। యత్ర స వాయుః తదా ఆకాశో।
యత్ర వా ఆకాశః తత్ వాయుః। తే ద్వే యోనిః। తదేకం మిథునమ్।।

వాయువు ఎక్కడుంటే అక్కడ ఆకాశము, ఆకాశము ఎక్కడుంటే అక్కడ వాయువు ఉండియే తీరుతాయి. ఆ ఉభయము ఒకదానికొకటి యోని స్థానము. ఆ రెండు జంటగా ఏకస్వరూపములు. ఆ మిథునము జలము-తరంగముల ఏకత్వము వంటిది.

అట్లాగే…,
‘‘యజ్ఞము’’ సవిత। వేదములు సావిత్రి।
‘‘మేఘములు (స్తనయత్ను)’’ సవిత। మెఱుపులు (విద్యుత్తు) సావిత్రి।
‘‘ఆదిత్యుడు’’ సవిత। ‘‘ద్యౌ’’ (తేజస్సు) (లేక) స్వర్గలోకము సావిత్రి
‘‘చంద్రమసము’’ సవిత। ‘‘నక్షత్ర’’ సావిత్రి।
‘‘మనస్సు’’ సవిత। వాక్కు సావిత్రి।

ఇవన్నీ భావికుడు-భావన, వ్యక్తి-వ్యక్తీకరణము, గుణి-గుణములు, ఆలోచించువాడు-ఆలోచనలు, జీవి-జీవితములవలె మిథునము (పరస్పర అవినాభావ ఏకత్వము) వంటివి. ఒకటి రెండవది ఉనికి-జనన-సంచార-సయోగ స్థానము.

ఇవన్నీ కూడా మొదటిది. రెండవదానియందు, రెండవది మొదటి దానియందు యోనిగా (జనన స్థానముగా, నివాసముగా) కలిగి ఉన్నాయి. పరస్పరము యోని - మిథునము (కలయిక, ఏకత్వము) కలిగి ఉన్నాయి. ఈ విధంగా పరస్పరము అభేద రూపములు కూడా.

పురుషుడు - స్త్రీ:

పురుషుడు స్త్రీ నుండి జనించుచున్నాడు. స్త్రీ పురుషుని జననస్థానముగా కలిగి యున్నది. పరస్పరము యోని స్థానము కలవారై, జంటగా ఏకస్వరూపులై ఉన్నారు. పురుషుడెక్కడ ఉంటే, అక్కడ స్త్రీ ఉండియే తీరుతుంది. స్త్రీ ఎక్కడ ఉంటే అక్కడ పురుషుడు ఉండియే ఉంటారు. మిథునము (పరస్పరకలయిక)చే స్త్రీ - పురుష సంతానము.

పురుషుడు - ప్రకృతి:

ప్రకృతి నుండి పురుషుడు జనిస్తూ, పురుషునికి ప్రకృతి యోనిస్థానమగుచున్నది. పురుషుని నుండి ప్రకృతి జనిస్తూ పురుషుడు ప్రకృతికి యోని స్థానమగుచున్నాడు. ‘పురుష-ప్రకృతులు మిథునముగా (జంటగా) ఏకముగా పరస్పరము ఏర్పడినవారై, -అవినాభావులై అభేదరూపులై ఉంటారు. ప్రకృతి ఎక్కడుంటే అక్కడ పురుషుడు, పురుషుడు ఎక్కడ ఉంటే - అక్కడ ప్రకృతి → ఇరువురు ఉంటారు. ప్రకృతి - పురుషులు ఏకస్వరూపులే! ఉభయులు సర్వదా ఒకే రూపముతో సంప్రకాశమానులగుచున్నారు.

ఈ మిథునమే పరమాత్మ-జీవాత్మల అన్యోన్యత్వము, అనన్యత్వము, అవినాభావత్వముల రూపమై కూడా ఏర్పడియున్నది.
అట్టి పరస్పర స్త్రీ - పురుష (లేక) ప్రకృతి - పురుష అవినాభావ - ఏకస్వరూప స్వానుభవమునకై మహర్షులు గాయత్రీ మంత్రమును మూడు పాదములుగల ఏక-అక్షర ఓంకార సహితంగా మానవాళికి ఉపాసనగా ప్రసాదించుచున్నారు.

గాయత్రీమంత్ర త్రిపాదములు

(1.) తస్యా ఏష ప్రమ పాదః - (భూః = Zone of Matter)

‘‘భూః’’ పాదో - ‘‘తత్ సవితుః వరేణ్యమ్’’। భౌతికంగా కనిపిస్తున్న పరమాత్మయొక్క ప్రథమ పాదమునకు నమస్కారము.

ఈ భౌతికంగా కనిపించేదంతా సావిత్రీ స్వరూపమై సత్‌విత్ స్వరూపుడగు సవిత్రుభగవానుని స్తుతియే.

భూః వరేణ్యమ్ ఇతి।।
భౌతికంగా కనిపించేదంతా ఆత్మ - భగవత్ స్తుతియే।
అగ్నిర్వై వరేణ్యమ్
అగ్నిరూపముగా ఉన్నదంతా ఆ పరమాత్మయొక్క స్తోత్రమే। ఉపాసనారూపమే।
చంద్రమా వరేణ్యమ్
ఓషధీ - వనస్పలను, ఆహారమును ప్రసాదించు చంద్రమా తత్త్వమంతా పరమేశ్వర భౌతికరూప వర్ణనములే. పుష్పములు, ఫలములు, ధాన్యములు, అపరములు - అన్నీ పరమాత్మ రూప వర్ణనలే. పరమాత్మ-పరమేశ్వరీతత్త్వమే. సవితృ-సావిత్రీ అనన్యతత్త్వమే।

(2.) తస్యా ఏష ద్వితీయ పాదః - (భువః = Zone of Thoughts, Feelings and Experiencing)

‘‘భువః’’ భర్గమయో ‘‘భువో’’ ‘‘భర్గోదేవస్య’’ ధీమహి।
- వెలుతురుగా, కాంతిగా, తేజస్సుగా కనిపిస్తున్న పరమాత్మయొక్క ద్వితీయ పాదమునకు నమస్కారము.

అగ్నిర్వై భర్గః
అగ్ని పరమాత్మయొక్క భర్గో దివ్య తేజో ప్రదర్శనము.
భర్గ ఆదిత్యో వై
సూర్యమండలము భర్గోదేవుని తేజో ప్రదర్శనము.
చంద్రమావై భర్గః
చంద్రమండలము సూర్యుడు వెలిగించు మండలముగా భర్గోదేవ ప్రత్యక్ష సంప్రదర్శనము.

ఈవిధంగా అవన్నీ భర్గోదేవుడగు పరమాత్మయొక్క ధీస్వరూప మహిమలే. ఆయనయొక్క తేజో విలాసములే।

(3.) తస్యా ఏష తృతీయ పాదః - సమస్త జీవులలో ‘అనుభవి’గా ప్రత్యక్షమైయున్న పరమాత్మయొక్క తృతీయపాదమునకు నమస్కారము. (Matter of స్వః = Self. Zone of Sense of SELF)

‘‘స్వ (సుః) - స్వర్ధియో (ధియో) యోనః ప్రచోదయాత్’’
స్త్రీ-పురుషుల నుండి ప్రదర్శితమగు ప్రజనితమంతా (జీవుల ఉత్పత్తి మొదలైనదంతా) సావిత్రీతత్త్వమే. ఈ విధంగా ‘‘ఓం’’కారము - అఖండ - ఏక -అక్షర పరబ్రహ్మమే - సావిత్రీరూపము. అనగా →

‘‘భూః’’ సవితుః వరేణ్యమ్
భౌతిక రూపములుగా, (Matter)
‘‘భువో’’ భర్గో దేవస్య ధీమహి
దివ్యమగు భర్గోదేవ మహామనోస్వరూపముగా, (Thought)
‘‘సువో’’ ధియోయోనః ప్రచోదయాత్
మహాబుద్ధి స్వరూపమై, సర్వజనన స్థానమై, ‘అనుభవి’ రూపమై (Self/I)

సవిత్రు - సావిత్రి స్వరూపమై, ఈ సమస్తము విరాజిల్లుచున్నది. సర్వత్రా వెలయుచున్నది.

అట్టి సవిత్రు - సావిత్రి పాద - గాయత్రీమంత్ర ఏకాక్షర బ్రహ్మముయొక్క కేవలరూప మోక్షానుభవమునకై ఈ జీవుడు అల్ప - భేద దృశ్య దృష్టులను జయించు బలమును సముపార్జించాలి. ఆ సమస్తము స్వస్వరూపాత్మగా భావించగలుగు అచంచల దృష్టియే-జీవనము, బలము, ఐశ్వర్యము కూడా.

అందుకు మహర్షులు ముముక్షుల కొరకై మంత్రసమన్వితమైన ‘‘బల-అతిబల’’ ఉపాసన విద్యను ప్రసాదించుచున్నారు.

‘‘బల-అతిబల సావిత్రీ ఉపాసన’’ (ఇహ-స్థైర్య, / పర-ఆత్మ భావనలు)

‘‘బల-అతిబల’’ మహామంత్రయోః

విరాట్ పురుష - ఋషిః। → ఈ విరాట్‌పురుష విశ్వస్వరూప పరమాత్మయే ‘ఋషి’.
గాయత్రీ - దేవతా। → గాయత్రీ జగన్మాతయే ‘దేవత’.
గాయత్రీ - ఛందః। → ఛందస్సు - ‘‘గాయత్రీ’’.
‘అ’ కార ‘ఉ’కార ‘మ’కార (ఓం) - బీజాద్యః → ‘‘అ ఉ మ’’ - ‘ఓం’కారము ఆదిబీజము.
క్షుదాద్యా నిరసనే - వినియోగః → ఆకలి, దప్పిక, కామక్రోధ మోహములు మొదలైన వాటిని జయించి, ఆత్మస్థానము చేరటము కొరకై వినియోగము. దృశ్య ధ్యాసను అధిగమించి ‘‘ఆత్మధ్యాస’’ కొరకై మంత్రోపాసనా వినియోగము.

‘‘క్లాం’’ ఇత్యాది షడంగన్యాసః। షడక్షర న్యాసః

కరన్యాసము అంగన్యాసము
‘‘క్లాం’’ అంగుష్ఠాభ్యాం నమః। ‘‘క్లాం’’ హృదయాయనమః।
‘‘క్లీం’’ తర్జనీభ్యాం నమః। ‘‘క్లీం’’ శిరసే స్వాహా।
‘‘క్లూం’’ మధ్యమాభ్యాం నమః। ‘‘క్లూం’’ శిఖయాయ వషట్।
‘‘క్లైం’’ అనామికాభ్యాం నమః। ‘‘క్లైం’’ కవచాయహుమ్।
‘‘క్లౌం’’ కనిష్ఠికాభ్యాం నమః। ‘‘క్లౌం’’ నేత్రత్రయాయ వేషట్।
క్లః కరతలకర పృష్ఠాభ్యాం నమః ‘‘క్లః’’ అస్త్రాయ ‘ఫట్’।

భూర్భువస్స్వ ‘ఓం’ - ఇతి దిగ్బంధః।।

బలా-అతిబల సవితా-సావిత్రీ - ధ్యానము

మం।। శ్లో।। అమృత కరతల ఆర్ద్రౌ, సర్వ సంజీవనాఢ్యాః,
అఘహరణ సుదక్షౌ వేదసారే మయూఖే,
ప్రణవమయ వికారౌ భాస్కరాకార దేహౌ
సతతమ్ అనుభవే అహమ్ తే బలా - అతిబలేశౌ।।

‘‘బల - అతి బలేశ్వరి’’ అయినట్టి సవితా - సావిత్రీ దేవి మాకు సర్వే సర్వత్రా స్వానుభవమై, అనుక్షణికానుభూతిగా సిద్ధించును గాక।


బలాతిబల సవితిః-సావిత్రీ ఉపాసనా - మూలమంత్రము


ఓం హ్రీం క్లీం తత్సవితుః వరేణ్యం భర్గో దేవస్య ధీమహి।
ధియో యోనః ప్రచోదయాత్
ఓం హ్రీం బలే మహాదేవి।
హ్రీం మహాబలే।
క్లీం చతుర్విధ పురుషార్థ సిద్ధిప్రదే।
తత్సవితుః వరదాత్మికే।
హ్రీం వరేణ్యం।
భర్గో దేవస్య వరదాత్మికే।
అతిబలే। సర్వదయామూర్తే।
బలే। సర్వక్షుద్ర భ్రమ ఉపనాశిని।
ధీమహి। ధియోయో నః జాతే।
ప్రచుర్యా ప్రచోదయాత్మికే।
ప్రణవ శిరస్కాత్మికే।
హుం ఫట్ స్వాహా।।

ఈ ‘‘బలాతి బల సవితుః సావిత్రీ మహామంత్రము’’ను ఎరిగి, ఆరాధించి, ఉపాసించి సమాశ్రయించువాడు

సావిత్ర్యా ఏవ సలోకతాం జయతి।

లోక జయము -
1. లోకములన్నీ నాలోనే ఉన్నాయి. (పర)
2. లోకములో నేనున్నాను. (ఇహ)
ఉభయముల ఏకత్వము - మిథునము


ఇతి సావిత్రి ఉపనిషత్
ఓం శాంతిః శాంతిః శాంతిః